Friday, March 31, 2023
Friday, March 31, 2023

యూపీకి రాకేశ్‌ తికైత్‌తో సహా రైతు నేతలు

ప్రయాగ్‌రాజ్‌, గోరఖ్‌పూర్‌, వారణాసిలో ఎస్‌కేఎం సదస్సులు
రైతు వ్యతిరేకులకు గణపాఠమే లక్ష్యం

నోయిడా : రైతు వ్యతిరేకులకు గుణపాఠం నేర్పడమే లక్ష్యంగా ఎన్నికల రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌, గోరఖ్‌పూర్‌, వారణాసి జిల్లాల్లో భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్‌ తికైత్‌తో పాటు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు కొందరు పర్యటించనున్నట్లు ఎస్‌కేఎం ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 23న ప్రయాగ్‌రాజ్‌లో, 28న గోరఖ్‌పూర్‌లో, మార్చి 2న వారణాసిలో సదస్సులను ఎస్‌కేఎం నిర్వహిస్తుందని బీకేయూ అధికార ప్రతినిధి సౌరభ్‌ ఉపాధ్యాయ తెలిపారు. ‘ఎస్‌కేఎం కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో రైతు నేతలు రాకేశ్‌ తికైత్‌, శివ్‌కుమార్‌ శర్మ ‘కక్కాజీ’, యోగేంద్ర యాదవ్‌ తదితరులు పర్యటిస్తారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు సూచించరుగానీ రైతు వ్యతిరేకులకు గుణపాఠం నేర్పమని నాయకులు కోరుతారు’ అని ఉపాధ్యాయ అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో 27న, గోరఖ్‌పూర్‌లో మార్చి 3న వారణాసిలో మార్చి 7న పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. ప్రయాగ్‌రాజ్‌ నుంచి యూపీ మంత్రులు నంద్‌ గోపాల్‌ గుప్తా, సిద్ధార్థ నాథ్‌ సింగ్‌ పోటీ చేస్తుండగా సీఎం ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌ బరిలో నిలిచారు. వారణాసి ప్రధాని మోదీ లోక్‌సభ నియోజకవర్గం కాగా బీజేపీకి కుంచుకోటగా ఈ స్థానాన్ని పరిగణిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img