Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

యోగికి అసమ్మతి సెగ

జలశక్తి మంత్రి దినేశ్‌ ఖటిక్‌ రాజీనామా` అమిత్‌షాకు లేఖ
దిల్లీలో పార్టీ పెద్దలతో భేటీకి జితిన్‌ ప్రసాద యత్నం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం సొంతవర్గం నుంచి తిరుగుబాటును ఎదుర్కొంటోంది. యోగి పనితీరుపై సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమంత్రి అన్ని శాఖలపై పెత్తనం చలాయించడం, తమ శాఖల బదిలీల్లోనూ జోక్యం చేసుకోవడం వంటివి వారికి కోపం తెప్పించాయి. ఇదే క్రమంలో జలశక్తి శాఖ సహాయమంత్రి, దళిత నాయకుడు దినేశ్‌ ఖటిక్‌ బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి బదులుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు పంపారు. దళితుడిని కాబట్టే శాఖలో తన మాటకు గౌరవం లేదని, విలువ లేనప్పుడు పదవి ఎందుకనే రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. మరో మంత్రి జితిన్‌ ప్రసాద కూడా ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
‘వంద రోజులుగా నాకు ఏ పని ఇవ్వలేదు. నేను కలత చెందాను కాబట్టే రాజీనామా చేస్తున్నా. శాఖ బదిలీల్లో అవకతవకలు జరుగుతున్నాయి. దళితుడిని కాబట్టే నాకు ప్రాధాన్యత లేదు. మంత్రిగా అధికారం లేదు. నేను మంత్రిగా ఉండటం వల్ల దళిత వర్గానికి ప్రయోజనం లేదు. నన్ను ఏ సమావేశానికి పిలవడం లేదు. నా మంత్రిత్వశాఖ గురించి సమాచారం ఇవ్వడం లేదు. ఈ వైఖరి దళిత వర్గానికే అవమానకరం’ అని దినేశ్‌ ఖటిక్‌ తన లేఖలో అసహనాన్ని వ్యక్తంచేశారు. ఆయన ఇప్పటికే తన అధికారిక నివాసాన్ని, వాహనాన్ని వదిలి హస్తినపూర్‌లోని సొంతింటికి వెళ్లిపోయారు. తన శాఖలో బదిలీలు, హస్తినపూర్‌లోని తన మద్దతుదారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుతో కోపంగా ఉన్న దినేశ్‌ను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
పీడబ్ల్యూడీ మంత్రి జితిన్‌ ప్రసాద కూడా రాజీనామా యోచనలో ఉన్నారు. యోగిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన దిల్లీలో బీజేపీ పెద్దలతో మంతనాలకు యత్నిస్తున్నారు. తన శాఖలోని అధికారి, ఓఎస్‌డీ అనిల్‌ కుమార్‌ పాండే బదిలీ వ్యవహారం ఆయనకు కోపం తెప్పించింది. అయితే మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ ఇద్దరు మంత్రుల ఫోన్లు అందుబాటులో లేకపోవడం, బుధవారం దినేశ్‌ రాజీనామా, అమిత్‌షా వద్ద పంచాయితీకి జితిన్‌ ప్రసాద యత్నాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ఆకస్మిక పరిణామాలతో ఉత్తరప్రదేశ్‌ మంత్రుల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు, వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలను బీజేపీ అధిష్ఠానం మొదలు పెట్టిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అసంతృప్తి నేతలకు దిల్లీ నుంచి త్వరలోనే పిలుపు రానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img