Friday, June 2, 2023
Friday, June 2, 2023

స్మోక్‌ బాంబుతో జపాన్ ప్రధానిపై దాడి!

వకయామాలో ప్రధాని ప్రసంగించడానికి ముందు స్మోక్ బాంబు పేలుడు
ప్రధాని కిషిడాను సురక్షితంగా అక్కడి నుంచి తరలించిన భద్రతా సిబ్బంది
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వకయామాలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ స్మోక్‌బాంబు భారీ శబ్దంతో పేలింది. వెంటనే అప్రమత్తమైన ప్రధాని భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. వకయామా నగరంలో ఆయన ప్రసంగించడానికి ముందు దుండగులు పైప్ బాంబు విసిరారు.అది పెద్ద శబ్దంతో పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వకయామాలోని ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన తర్వాత ఆయన ప్రసంగించడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది. వకయామా నంబర్-1 జిల్లాలో ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రధాని ప్రసంగించాల్సి ఉండగా ఈ ఘటన జరిగినట్టు తెలిపింది. పేలుడు నేపథ్యంలో ప్రధాని కిషిడా ప్రసంగం రద్దయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img