Friday, April 26, 2024
Friday, April 26, 2024

10 వేల పైనే కరోనా కేసులు

గత 24 గంటల్లో 10, 753 కేసుల నమోదు..మరో 27 మంది మృతి
భారత్ లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. కొన్ని రోజులుగా వేలాది కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 10,753 పాజిటివ్ కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో, భారత్ లో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కి చేరింది. నెల రోజులుగా కరోనా కేసులు పెరుగుతూ ఉండగా…ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 50వేల మార్కును దాటేయడం ఆందోళన కలిగిస్తోంది.ప్రాణాంతక వైరస్ కారణంగా తాజాగా 27 మరణాలు నమోదయ్యాయి. దాంతో, ఇప్పటివరకూ 5,31,091 మంది కరోనాతో చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ఎక్స్ బీబీ.1.16 కారణం అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 6.78 శాతానికి పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img