Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అగ్నిపథ్‌ నిరసనలతో 200 రైళ్లపై ప్రభావం

35 రైళ్లు రద్దు, 13 తాత్కాలికంగా నిలిపివేత : రైల్వే శాఖ
న్యూదిల్లీ : సైనిక దళాల్లో నియామకం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చెలరేగిన కారణంగా ఇప్పటి వరకు 200కి పైగా రైలు సర్వీసులపై ప్రభావం పడిరదని రైల్వేలు శుక్రవారం తెలిపాయి. బుధవారం నిరసనలు ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 35 రైళ్లు రద్దవగా, 13 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వివరించింది. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన అనేక ప్రాంతాలతో పాటు బీహార్‌, జార్ఖండ్‌లలో నడిచే తూర్పు మధ్య రైల్వేలపై ఇది తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ రాష్ట్రాల్లో విస్తృతంగా నిరసనలు చెలరేగాయి. దీంతో ఎనిమిది రైళ్ల కార్యకలాపాలను పర్యవేక్షించాలని కూడా నిర్ణయించింది. ఈ రైళ్ల రాకపోకలను నిశితంగా గమనించడంతో పాటు నిరసనలు తీవ్రమైనప్పుడు వాటిని నడిపే విషయమై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఎనిమిది రైళ్లలో 12303 హౌరాన్యూదిల్లీ పూర్వా ఎక్స్‌ప్రెస్‌, 12353 హౌరాలక్నో ఎక్స్‌ప్రెస్‌, 18622 రాంచిపాట్నా పాటిలీపుత్ర ఎక్స్‌ప్రెస్‌, 18182 దానాపూర్‌టాటా ఎక్స్‌ప్రెస్‌, 22387 హౌరాధన్‌బాద్‌ బ్లాక్‌ డైమండ్‌ ఎక్స్‌ప్రెస్‌, 13512 అసన్‌సోల్‌టాటా ఎక్స్‌ప్రెస్‌, 13032 జైనగర్‌హౌరా ఎక్స్‌ప్రెస్‌, 13409 మాల్దా టౌన్‌కియుల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి. అలాగే రెండు ఈసీఆర్‌ రైళ్లు 12335 మాల్దా టౌన్‌లోక్‌మాన్య తిలక్‌(టి) ఎక్స్‌ప్రెస్‌, 12273 హౌరాన్యూదిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ కూడా రద్దయ్యాయి. అయితే రద్దయిన ఇతర రైళ్ల వివరాలు వెంటనే ఇంకా తెలియరాలేదు. ఉత్తర సరిహద్దు రైల్వేలు నడుపుతున్న అనేక రైళ్లు కూడా ఈసీఆర్‌ అధికార పరిధి గుండా వెళతాయి. వాటిలో మూడిరటిపై కూడా ప్రభావం పడినట్లు రైల్వేలు తెలిపాయి. ఈసీఆర్‌లో నడుస్తున్న మూడు రైళ్ల కోచ్‌లు, కుల్హారియాలో ఒక ఖాళీ రేక్‌ (ఈసీఆర్‌లో కూడా) హింసాత్మక నిరసనకారుల వల్ల దెబ్బతిన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బలియా వద్ద వాషింగ్‌ లైన్‌లో ఉన్న ఒక రైలు కోచ్‌ కూడా దెబ్బతింది. ఈ ఆస్తి నష్టాలను ప్రస్తుతానికి అంచనా వేయడం కష్టమని రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, తెలంగాణ రాష్ట్రం సికిందరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిరసనకారులు ఒక రైలు కోచ్‌ను తగలబెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img