Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆగని పెట్రో మంట..


వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రో ధరలు
దేశంలో వరుసగా నాలుగోరోజూ చమురు ధరలు పెరిగాయి. మంగళవారం నుంచి ప్రతిరోజూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చమురు మార్కెటింగ్‌ కంపెనీలు మరోసారి లీటరు పెట్రోలుపై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పునవడ్డించాయి. దేశ రాజధాని నగరమైన ఢల్లీిలో పెట్రోల్‌ ధర లీటరుపై 30 పైసలు పెరిగి రూ.103.54కు చేరింది. డీజిల్‌ లీటరు ధర రూ.91.77 నుంచి 92.12రూపాయలకు పెరిగింది.ఇక ముంబైలో పెట్రోల్‌ రూ.109.54, డీజిల్‌ రూ.99.22, చెన్నైలో పెట్రోల్‌ 101.01, డీజిల్‌ 96.60, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.104.23, డీజిల్‌ రూ.95.23కు చేరాయి. ఇక హైదరాబాద్‌లో పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటరు డీజిల్‌ రూ.100.51కి చేరుకోగా, లీటరు పెట్రోలు రూ.107.73కు పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img