Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆర్మీ హెలికాప్టర్‌ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ

ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరీ
తమిళనాడులోని కూనురు వద్ద జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాద ఘటనపై కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ చాలా నిష్పక్షపాతంగా జరుగుతున్నట్లు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరీ తెలిపారు. హైదరాబాద్‌లోని దుండిగల్‌ వైమానిక దళ అకాడమీలో ఇవాళ జరిగిన పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, సీడీఎస్‌ రావత్‌ దంపతులు, మరో 12 మంది రక్షణదళ సిబ్బంది మృతి పట్ల ఆయన నివాళులర్పించారు. సీడీఎస్‌ రావత్‌ మృతి కేసులో కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ చాలా నిష్పక్షపాతంగా జరుగుతోందని, అయితే దర్యాప్తుకు సంబంధించిన అంశాలను వెల్లడిరచలేనన్నారు. ప్రతి చిన్న కోణాన్ని కూడా పరిశీలించాల్సి వస్తోందన్నారు. హెలికాప్టర్‌ ప్రమాదం జరగడానికి దారి తీసిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌లో పాల్గొన్న ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ గౌరవ వందనం స్వీకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img