Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆ ప్రాజెక్టుకు అనుమతిలేదు

. ఎన్జీటీ స్టే ఇచ్చినా ఆవులపల్లి పనుల కొనసాగింపు
. ఏపీపై కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో అనుమతిలేకుండా ప్రాజెక్టును నిర్మిస్తున్నారని కృష్ణాబోర్డుకు తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ స్టే ఇచ్చినప్పటికీ చిత్తూరు జిల్లాలో ఆవులపల్లి రిజర్వాయర్‌ పనులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందని కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. అనుమతులు లేకుండా చిత్తూరు జిల్లాలో ఆవులపల్లి రిజర్వాయర్‌ నిర్మిస్తున్నారని ఆ ఫిర్యాదులో తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ నిలిపివేస్తూ ఎన్జీటీ ఇంతకుముందే ఆదేశాలు జారీ చేసిందన్నారు. రిజర్వాయర్‌ నిర్మాణం కొనసాగించడంపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌ గురువారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఎన్జీటీ స్టే ఇచ్చినప్పటికీ పనులు కొనసాగిస్తున్నారని ఆ లేఖలో తెలిపారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్‌ పనులు చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌ని నిలువరించాలని కృష్ణా బోర్డును మురళీధర్‌ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img