Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇంటర్‌ ద్వితీయ ఫలితాల విడుదల

ఏపీలో 5 లక్షల 19 వేల 797 మంది ఉత్తీర్ణత
హైపవర్‌ కమిటీ నివేదిక ఆధారంగా ఫలితాలు
ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ అడ్మిషన్లు
మొదటి ఏడాది ఫీజు చెల్లించిన వారంతా ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి :
ఏపీ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర (మార్చి 2021) పబ్లిక్‌ పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ వెల్లడిర చారు. విజయవాడ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజ శేఖర్‌తో కలసి మంత్రి సురేష్‌ ఫలితాలు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చి 5వ తేదీన జరగాల్సిన ఇంటర్మీడియట్‌ పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేశామని, తిరిగి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాక సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దు చేశామని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు చేశామ న్నారు. 2021 జులై 31వ తేదీలోగా ఇంటర్‌ పరీక్ష

ఫలితాలు వెల్లడిరచాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, వారం రోజుల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలు ప్రకటించిందన్నారు. ఛాయారతన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితా లపై ఇచ్చిన నివేదికను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 10 తరగతిలో మూడు బెస్ట్‌ సబ్జెక్ట్‌లలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని 30శాతం వెయిటేజ్‌ మార్కులు, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్ట్‌ల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని 70శాతం వెయి టేజ్‌ మార్కుల ప్రామాణికంగా ఫలితాలు ప్రకటించామన్నారు. రాష్ట్రంలో 5 లక్షల 19 వేల 797 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులను ఉత్తీర్ణులు చేశామన్నారు. వారిలో రెగ్యులర్‌ విద్యార్థులు 5 లక్షల 08 వేల 672 మంది కాగా, ప్రైవేట్‌ విద్యార్థులు 11 వేల 125 మంది ఉన్నారని చెప్పారు. విద్యార్థులు ఈ కింది తెలిపిన వెబ్‌సైట్లలో పరీక్షా ఫలితాలు తెలుసుకోవచ్చని సూచించారు.
పరీక్ష ఫలితాల కొరకు : ష్ట్ర్‌్‌జూ://వఞaఎతీవంబశ్ర్‌ీం.aజూ.అఱష.ఱఅ, ష్ట్ర్‌్‌జూ://తీవంబశ్ర్‌ీం.పఱవ.aజూ.స్త్రశీఙ.ఱఅ, ష్ట్ర్‌్‌జూ://తీవంబశ్ర్‌ీం.aజూషటంం.ఱఅ, ష్ట్ర్‌్‌జూ://పఱవ.aజూ.స్త్రశీఙ.ఱఅ
ఫలితాలపై అభ్యంతరాలుంటే బెటర్‌మెంట్‌
ప్రకటించిన పరీక్ష ఫలితాల పట్ల విద్యార్థులకు అభ్యంతరాలుంటే, వారికోసం బెటర్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడిరచారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈనెల 26 తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మార్కుల మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చున న్నారు. బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌(బీఐఈ) ఆధికారిక సైట్‌ పఱవ.aజూ.స్త్రశీఙ.ఱఅ నుండి విద్యార్థులు మార్కుల మెమో పొందవచ్చునని పేర్కొన్నారు. ఐపీఈ2021 పరీక్ష ఫలితాలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే తెలియజేయవచ్చునని, దాని కోసం ఈమెయిల్‌ ఐడీ శీబతీపఱవaజూఏస్త్రఎaఱశ్రీ.షశీఎ వాట్సప్‌ నెంబరు 9391282578 (మెసేజ్‌ కోసం)కు తెలియజేయవచ్చునని సూచించారు. సమావేశంలో ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img