Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇండియన్‌ డాక్యుమెంటరీ
‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’కు ఆస్కార్‌

లాస్‌ ఏంజెల్స్‌ : ఆస్కార్‌ అవార్డుల్లో భారత చిత్రాలు ప్రతిభను చాటాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డును గెల్చుకోగా, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ విభాగంలోనూ ఇండియాకు ఆస్కార్‌ వచ్చింది. ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ అనే డాక్యుమెంటరీ ఆస్కార్‌ అవార్డు గెలుచుకుని దేశం మీసం మెలేసింది. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ డాక్యుమెంటరీని నిర్మించింది. ఈ డాక్యుమెంటరీని కార్తికీ గాన్‌స్లేవ్స్‌ తెరకెక్కించగా, గునీత్‌ మోంగా నిర్మించారు. కుట్టునాయకన్‌ అనే గిరిజన కుటుంబంతో కలిసి పెరిగిన ఏనుగు కథ ఇది. ఐదేళ్ల పాటు ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ సాగింది. రఘు అనే ఏనుగు కథతో దీన్ని తెరకెక్కించారు. ఏనుగులు, వాటి సంరక్షకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీలో చాలా గొప్పగా చూపించారు. ప్రకృతికి అనుగుణంగా ఉన్న గిరిజన ప్రజల జీవితాన్ని గురించి కూడా ఇందులో చూపించారు. అసలు ఈ డాక్యుమెంటరీ చూస్తే ఒక అద్భుతం మన కళ్లకు ఆవిష్కృతమవుతుంది. ‘హౌలౌట్‌’, ‘హౌ డు యు మెసర్‌ ఎ ఇయర్‌’, ‘ది మార్టా మిచెల్‌ ఎఫెక్ట్‌’, ‘స్ట్రేంజర్‌ ఎట్‌ ది గేట్‌’ వంటి డాక్యుమెంటరీలు ఈ అవార్డు కోసం పోటీ పడగా, మన డాక్యుమెంటరీకి పురస్కారం దక్కింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img