Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఇక గుజరాత్‌పై మోదీ దృష్టి

స్వరాష్ట్రానికి వెళ్లనున్న మోదీ
న్యూదిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌ పర్యటనకు వెళ్లనున్నారు. బీజేపీ రాజకీయాలను నడిపించే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు అఖిలభారత ప్రతినిధుల మహాసభలు రాష్ట్రంలోనే జరగనున్న తరుణంలో ఆయన శుక్ర, శని వారాల్లో గుజరాత్‌లో పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా శుక్రవారం భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నట్టు పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిరచినంత పని చేసిన కాంగ్రెస్‌ మరింత పుంజుకుందనే సంకేతాలు వెలువడడం బీజేపీ వర్గాలను కలవర పెడుతున్నాయి. 2017లో రాష్ట్రంలోని 182 నియోజకవర్గాల్లో 150 స్థానాల్లో గెలుస్తామని అంచనా వేసుకున్న బీజేపీని రాహుల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ 99 స్థానాలకే పరిమితం చేయడం, తాము 77 సీట్లలో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలవడం బీజేపీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. చాలాకాలంగా అధికారంలో ఉండడం, ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగిందనే సంకేతాలు వెలువడటంతో బీజేపీ ఆందోళనకు గురవుతోంది. డిసెంబరులో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పరిస్థితులు చేయి జారకుండా ఏకంగా ప్రధాని మోదీనే దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ఇందుకోసం చాలా ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని శుక్రవారమే ఆయన పూరించనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ యూపీ ఎన్నికల్లో బీజేపీకి దక్కేది ఏదీ ఉండదని, ఆ పార్టీకి రానున్న గుజరాత్‌ ఎన్నికల్లో అసలైన ఆశ్చర్యం కలిగించే ఫలితాలు ఉంటాయని, మహాత్మాగాంధీ హంతకులకు గుజరాత్‌ ప్రజలు సరైన గుణపాఠం చెప్పనున్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి నుంచే సొంత రాష్ట్రంలో పరువు పోకుండా మోదీ అటువైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img