Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇక గ్రామం యూనిట్‌గా వాక్సినేషన్‌

ఉపాధ్యాయులు, స్కూలు సిబ్బందికి ప్రాధాన్యత
తర్వాత ప్రజాబాహుళ్యంతో సంబంధాలున్నవారికి అవకాశం
డిజిటల్‌ హెల్త్‌పై అధికారులు దృష్టి పెట్టాలి
కోవిడ్‌ సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు

అమరావతి : ఇకపై రాష్ట్రంలో గ్రామాల యూనిట్‌గా వాక్సినేషన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యత పరంగా వాక్సినేషన్‌ ఇవ్వడానికి అవకాశం ఉండడమేగాక, వాక్సిన్లు వృథా కాకుండా మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. కోవిడ్‌-19 నివారణ, నియంత్రణ, వాక్సినేషన్‌పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ఈనెల 16 నుంచి పాఠశాలలు ప్రారం భించనున్నందున వాక్సినేషన్‌ ప్రక్రియలో ఉపాధ్యాయులతో పాటు స్కూళ్లలో పని చేస్తున్న సిబ్బందికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే 18-44 ఏళ్ల మధ్య ఉన్న వారికి కూడా వాక్సిన్లు ఇవ్వాలని, దీనిపై కార్యాచరణ రూపొం దించాలని ఆదేశించారు. అనంతరం ఏపీ డిజిటల్‌ హెల్త్‌పై సమీక్షిస్తూ ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల డేటాను నిక్షిప్తం చేయాలని, క్యూఆర్‌కోడ్‌ రూపంలో ఈ వివరాలు తెలుసుకునేలా ఉండాలని సీఎం సూచించారు. విలేజ్‌ క్లినిక్స్‌లో కూడా డేటా నమోదు ఉండాలని, ప్రతి విలేజ్‌, వార్డు క్లినిక్స్‌లో కూడా కంప్యూటర్‌ ఉంచాలని, దానిలో బ్లడ్‌ గ్రూప్‌ల వివరాలు కూడా లభ్యమయ్యేలా ఉండాల న్నారు. 104 అంబులెన్స్‌ గ్రామాలకు వెళ్లేసరికి, ఒక వ్యక్తి ఆరోగ్య వివరాలు డాక్టర్‌కు సులభంగా తెలిసేలా ఈ విధానం ఉండాలన్నారు. షుగర్‌,

బీపీ, బ్లడ్‌ గ్రూపు సహా ఇతర వివరాలను కార్డులో నిక్షిప్తం చేయాలని చెప్పారు. భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరుమీద ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చే ఆలోచన చేయాలని సీఎం సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డు నంబర్‌ చెప్పినా, ఆధార్‌ నంబరు చెప్పినా వెంటనే సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివ రాలు లభ్యమయ్యే విధానాన్ని తీసుకురావాలన్నారు. ఈ విధానాలన్నీ సమర్థవం తంగా అమలు చేయడంలో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
జిల్లా యూనిట్‌గా నియామకాలు
విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్‌ ఆస్పత్రులు వరకూ ఉండాల్సిన సిబ్బంది ఎంత మంది ఉన్నారు, ఇంకెంతమంది కావాలన్నదానిపై డేటాను తయారు చేయాలని, జిల్లాను యూనిట్‌గా తీసుకుని అవసరమైన సంఖ్యలో రిక్రూట్‌మెంట్‌ చేయాలని సీఎం సూచించారు మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికావాలని, సిబ్బంది కొరత అనేది ఉండటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. అలాగే గిరిజన ప్రాంతాలలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయన్న దానిపై పర్యవేక్షణ చేయాలని, అలాంటి చోట్ల సేవలు అందించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకాలపై ఆలోచన చేయాలన్నారు. ముఖ్యంగా పీహెచ్‌సీ నుంచి పైస్థాయి ఆస్పత్రుల వరకూ అన్నింటికీ కాంపౌండ్‌ వాల్స్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై సమీక్ష సందర్భంగా థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్‌, కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి(కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌, వాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జి ఎ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ వి.వినయ్‌ చంద్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img