Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈడీ ముందుకు సోనియాగాంధీ

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళ
నేషనల్‌ హెరాల్డ్‌కి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం తన నివాసం నుంచి బయల్దేరిన సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.ఈడీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత సోనియా విచారణ గదిలోకి వెళ్లారు. రాహుల్‌గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చి కాసేపటి తర్వాత వెళ్లిపోయారు. సోనియాగాంధీ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహాయకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతినిచ్చింది. అయితే విచారణ గదిలో కాకుండా మరో గదిలో ఉండాలని సూచించింది. కాగా ఇటివలే కరోనా బారినపడిన సోనియా గాంధీ కొవిడ్‌ అనంతరం దుష్ప్రభావాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఒక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న వ్యక్తిని ఈడీ ప్రశ్నించడం ఇదే తొలిసారి. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని దాదాపు 50 గంటలపాటు ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇక ఈడి వైఖరిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో న్యూఢల్లీిలోని ఈడి కార్యాలయం ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలను కఠినతరం చేశారు. ‘ఈడీ దుర్వినియోగాన్ని ఆపండి’ అంటూ కాంగ్రెస్‌ నేతలు బ్యానర్‌లతో పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ లోపల మార్చ్‌ నిర్వహించారు. ప్రతిపక్షాల గొంతుకను అణచివేసేందుకు కేంద్రం యత్నిస్తోందని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌లు మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img