Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఉచిత హామీలపై చర్చ అవసరం: సుప్రీంకోర్టు

రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు ముఖ్యమైన అంశమని, దీనిపై చర్చ జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడిరది. చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ అంశంపై ఇవాళ స్పందిస్తూ.. ఒకవేళ రాష్ట్రాలు ఉచిత హామీలు ఇవ్వవద్దు అని కేంద్రం ఏదైనా చట్టాన్ని చేస్తే..దానిపై న్యాయ సమీక్ష ఉండదని పేర్కొన్నారు. కానీ దేశ ప్రజల సంక్షేమం కోసం ఉచిత హామీల అంశాన్ని విచారించనున్నట్లు తెలిపారు. కఠిక పేదరికంలో ఉన్న గ్రామీణులకు ఉచిత హామీలు చాలా కీలకమైనమని, అయితే ఏది ఉచితం, ఏది కాదు, ఏది సంక్షేమం అన్న విషయాన్ని చర్చ ద్వారానే తేల్చగలమని కోర్టు అభిప్రాయపడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img