Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఊహించినట్లే జరిగింది…వడ్డీ రేటును పెంచిన ఆర్బీఐ

4.4 శాతంగా ఉన్న రెపో రేటును 4.9 శాతానికి పెంపు
పెంచిన వర్డీ రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయన్న ఆర్బీఐ
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్ల పెంపు తప్పలేదన్న శక్తికాంతదాస్‌

ఊహించినట్లుగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆర్బీఐ చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వడ్డీ రేటును పెంచుతూ ఆర్బీఐ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉదయం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఓ కీలక ప్రకటన చేశారు. రెపో రేటును 50 బేసిక్‌ పాయింట్లు పెంచుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. ప్రస్తుతం రెపో రేటు 4.4 శాతంగా ఉంది. దీనిని 4.9 శాతానికి పెంచుతున్నట్లుగా శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే వడ్డీ రేటును పెంచక తప్పడం లేదని ఆయన వివరించారు. పెంచిన వడ్డీ రేట్లు తక్షణమే అమలులోకి వస్తాయని కూడా ఆయన ప్రకటించారు. ఏప్రిల్‌, మే నెలల్లో ద్రవ్యోల్బణం స్థిరంగానే ఉందని కూడా ఆయన వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img