Friday, April 26, 2024
Friday, April 26, 2024

యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్‌

యూపీఐతో క్రెడిట్‌ కార్డుల అనుసంధానానికి అనుమతి..
ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలతోనే లింక్‌
ఇక మీదట క్రెడిట్‌, రూపే కార్డులతోనూ అనుసంధానం
సానుకూల నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

యూపీఐ వాడే వారికి గుడ్‌న్యూస్‌. ఇక డెబిట్‌ కార్డులు మాత్రమే కాక, క్రెడిట్‌ కార్డులను కూడా యూపీఐకి లింక్‌ చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. రూపే క్రెడిట్‌ కార్డులతో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొంది. దీంతో డిజిటల్‌ పేమెంట్ల మరింత పుంజుకోనున్నాయి. ఆర్‌బీఐ నేడు విడుదల చేసిన మానిటరీ పాలసీ ప్రకటనలో ఈ కీలక నిర్ణయం ప్రకటించింది. యూపీఐ చెల్లింపులను ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల నుంచే చేసుకునే సదుపాయం ఉంది. కానీ ఇక మీదట క్రెడిట్‌ కార్డులతోనూ యూపీఐ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇందుక వీలుగా క్రెడిట్‌ కార్డులు, రూపే క్రెడిట్‌ కార్డులను యూపీఐకి లింక్‌ చేసుకోవడానికి ఆర్బీఐ అనుమతించింది. ‘‘యూపీఐ భారత్‌ లో మరింత సమగ్రమైన చెల్లింపుల విధానంగా అవతరించింది. 26 కోట్ల యూజర్లు, ఐదు కోట్ల వ్యాపారులు ఈ ప్లాట్‌ ఫామ్‌ పై నమోదై ఉన్నారు. ఇటీవలి కాలంలో యూపీఐ ఎంతో పురోగతి సాధించింది. తమ దేశంలోనూ ఈ విధానం అమలుకు ఎన్నో దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి’’అని శక్తికాంతదాస్‌ తెలిపారు. ఈ ఏడాది ఒక్క మే నెలలోనే 594 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.10.4 లక్షల కోట్లుగా ఉంది. కార్డులపై ఈ మ్యాండేట్‌ చెల్లింపుల పరిమితిని రూ.5,000 నుంచి రూ.15,000కు ఆర్బీఐ పెంచింది. తరచూ చేసే చెల్లింపులకు ఈ మ్యాండేట్‌ సదుపాయం అనుకూలిస్తుంది. ఉదాహరణకు బీమా ప్రీమియంను ఏటా నిర్ణీత గడువులోపు చెల్లించాలని ఈ మ్యాండేట్‌ ఇస్తే.. కార్డు నుంచి ఆటోమేటిక్‌ గా చెల్లింపులు జరుగుతాయి. ఇప్పుడు ఈ పరిమితిని ఆర్బీఐ పెంచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img