Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎన్నిసార్లు వాయిదాలు

15లోగా ఉపాధి బాకీలు చెల్లించాలి
లేకుంటే ధిక్కార చర్యలు
రాష్ట్రప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :
ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 15 లోగా చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. 494 కేసులలో చెల్లింపులు చేయాల్సిందిగా రెండు వారాల క్రితం ఆదేశిస్తే కేవలం 25 కేసులలోనే చెల్లింపులు చేయడమేమిటని ప్రశ్నించింది. గ్రామ సర్పంచ్‌ బ్యాంకు అకౌంట్లోకి వేస్తే వారు కాంట్రాక్టర్‌కి చెల్లించడం లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అలా ఎవరున్నారో వివరాలు తెలియజేస్తే, వారిపైనా కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.
కొన్ని కేసులలో విచారణ జరుగుతుందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. విచారణ జరపకుండానే జరుగుతుందని చెబుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు విచారణ ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. విచారణ చేపడితే పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారా ? అని అడిగింది. రెండున్నరేళ్ల పాటు చెల్లింపులు నిలిపివేస్తే వారి జీవనాధారం ఏమిటని న్యాయస్థానం నిలదీసింది. 20 నుంచి 30 శాతం చెల్లింపులను కట్‌ చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వ న్యాయవాది కొంతగడువు కావాలని కోరగా, ప్రతిసారీ వాయిదా అడుగుతూ జాప్యం చేయడం సరికాదని హితవు పలికింది. ఈ నెల 15 నాటికి ఎవరికి ఎంత మొత్తం చెల్లించారో పిటిషనర్‌, ప్రభుత్వం వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img