Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏ క్షణంలోనైనా మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే చాన్స్‌ !.. సంజయ్‌ రౌత్‌ ట్వీట్‌..

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం.. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ల భాగస్వామ్యంతో ఏర్పడిన మహా వికాస్‌ అఘాడి కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడిరది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన ట్వీట్‌.. ఈ వార్తలకు బలం చేకూరిచ్చినట్టయింది. మహారాష్ట్రలో శాసనసభ రద్దు దిశగా రాజకీయ పరిణామాలు ఉన్నాయంటూ సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. శివసేన కీలక నేత ఏక్‌నాథ్‌ షిండే.. తనకు మద్దతుగా ఉన్న నేతలలో క్యాంపు రాజకీయం మొదలు పెట్టడంతో.. రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. తొలుత ఏక్‌నాథ్‌ షిండేతో 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టచ్‌లో ఉన్నట్టుగా ప్రచారం సాగినప్పటికీ.. ఆయనకు తన వెంట 40 మంది ఎమ్మెల్యేలున్నట్టు ప్రకటించారు. దీంతో మహారాష్ట్రలో అధికార మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img