Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏ ప్రయత్నాన్నీ వదలం..భారతీయుల తరలింపు వేగవంతం: మోదీ

లక్నో: యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలి పెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోన్‌భద్ర జిల్లాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ ఆపరేషన్‌ గంగా పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి తెస్తున్నామని చెప్పారు. వేలాదిమందిని ఇప్పటికే భారత్‌కు తీసుకువచ్చామని చెప్పారు. తాము చేపట్టిన ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు నలుగురు మంత్రులను అక్కడకు పంపామని, భారతీయులను సురక్షితంగా తెచ్చేందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదలిపెట్టేది లేదని అన్నారు. భారత్‌ బలం పెరుగుతున్నందునే మనం ఇలాంటి సురక్షిత చర్యలు తీసుకోగలుగుతున్నామని అన్నారు. కాగా, ఈనెల 7న జరిగే తుది విడత పోలింగ్‌లో సోన్‌భద్ర జిల్లా కూడా ఉంది.
పేదల సమస్యలు డబ్బున్నోళ్లకు అర్థం కావు
ఘాజీపూర్‌: ప్యాలెస్‌లలో నివసించేవారు, పెద్ద కార్లలో తిరిగేవారికి పేదల సమస్యలు అర్థంకావని మోదీ ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. తన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రశింసిస్తూ 100 ఏళ్ల తర్వాత వచ్చిన మహమ్మారి సమయంలోనూ ప్రజలను పస్తులుంచి నిద్రపుచ్చలేదని, వారందరికీ ఉచిత రేషన్‌ పంపిణీ చేశామన్నారు. ఘాజీపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. దేశం గర్వించదగిన మేధావులను ఘాజీపూర్‌ ఇచ్చిందన్నారు. ఘాజీపూర్‌కు చెందిన జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా పేరు ప్రస్తావించారు. మార్చి 7వ తేదీన ఘాజీపూర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img