Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఓటర్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు(ఓటర్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం బిల్లుకు) లోక్‌సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లు ఆమోదంతో ఇప్పుడు ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అయ్యింది. ఇక నుంచి ఓటు రిజిస్టర్‌ చేసుకోవాలనుకునే వారి నుంచి ఎన్నికల రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్లు ఆధార్‌ నెంబర్‌ను తీసుకుంటారు. ఐడెంటినీ గుర్తించేందుకు ఇది అవసరం అవుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు తెలిపారు. బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్‌ కార్డుతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును మంత్రి కిరణ్‌ రిజుజు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. అంతేగాక సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని మండిపడ్డాయి. విపక్షాల ఆందోళనతో సభ వాయిదాపడిరది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమవ్వగానే ఈ బిల్లుపై చర్చకు స్పీకర్‌ అనుమతించగా విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళన చేపట్టారు. దీంతో మరలా సభ వాయిదాపడిరది. అనంతరం 2.45 గంటలకు మళ్లీ సమావేశమైంది. ఈ బిల్లుపై మంత్రి కిరణ్‌ రిజుజు ప్రసంగించారు. ప్రతిపక్షాల ఆందోళన నడుమే స్పీకర్‌ ఓటింగ్‌ చేపట్టగా, బిల్లును లోక్‌సభ ఆమోదించింది. అనంతరం సభ వాయిదాపడిరది.
కాగా ఆధార్‌ చట్టం ప్రకారం ఆధార్‌ను ఓటర్‌ కార్డుతో అనుసంధానం చేయరాదు అని కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ అన్నారు. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. విపక్ష నేతలు అసదుద్దీన్‌ ఓవైసీ, శశిథరూర్‌ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఆధార్‌ను కేవలం అడ్రస్‌ ప్రూఫ్‌గా వాడారని, కానీ అది పౌరసత్వ ద్రవీకరణ పత్రం కాదు అని శశిథరూర్‌ అన్నారు. ఓటర్లను ఆధార్‌ అడిగితే, అప్పుడు కేవలం అడ్రస్‌ డాక్యుమెంట్‌ మాత్రమే వస్తుందని, అంటే పౌరులు కాని వారికి మీరు ఓటు వేసే హక్కు కల్పిస్తున్నట్లు అవుతుందని ఎంపీ శశిథరూర్‌ ఆరోపించారు. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును స్టాండిరగ్‌ కమిటీకి సిఫారసు చేయాలని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img