Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కోవిడ్‌ పరిస్థితిపై ఆందోళన అవసరం లేదు : కేజ్రీవాల్‌

దేశ రాజధానిలో కోవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. భయపడాల్సిన పని లేదని అన్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. పరిస్థితిలో మార్పులొస్తే అందుకు తగినట్టుగా అన్ని చర్యలు తీసుకుంటామని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. దిల్లీలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు 2.70గా నమోదు కావడంతో సిటీలో మళ్లీ కోవిడ్‌ తలెత్తిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 4న కోవిడ్‌ పాజిటివిటీ రేటు 0.5కు పెరిగి ప్రస్తుతం 2.70 శాతానికి చేరింది. దీనిపై దిల్లీి ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ మాట్లాడుతూ, కోవిడ్‌ పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించిందని, కొత్త వేరియంట్‌ కనుగొనేంతవరకూ ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. దిల్లీలో ప్రతిరోజు 100 నుంచి 200 కేసులు నమోదు అవుతున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img