Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చట్టానికి లోబడి కూల్చివేతలు సాగాలి: సుప్రీంకోర్టు

బుల్డోజర్లతో యూపీ ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్ధానం కీలక వ్యాఖ్యలు చేసింది.చట్టబద్ధంగా కూల్చివేతల చర్యలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రయాగ్‌రాజ్‌, కాన్పూర్‌ పౌర అధికారుల నుంచి సమాధానాలు కోరింది. అంతా సక్రమంగా జరగాలని, అధికారులు చట్టానికి లోబడి మాత్రమే నడుచుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. యూపీ ప్రభుత్వం ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వారి ఆస్తులను నేలమట్టం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పిటిషనర్లు ఆరోపించారు. చట్టబద్ధ ప్రక్రియను అనుసరించకుండా ఇక ముందు కూల్చివేతలు చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జమైతే ఉలేమా హింద్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. చట్ట నిబంధనలకు లోబడే కూల్చివేత డ్రైవ్‌ను చేపట్టామని, బుల్డోజర్లతో ఆక్రమణలను కూల్చివేసే ముందు నోటీసులు జారీ చేయలేదని పిటిషనర్‌ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే తాము యూపీ ప్రభుత్వ చర్యలను నిలిపివేయాలని కోరడం లేదని, ఎలాంటి చర్యలైనా చట్ట పరిధిలో ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తమ అభ్యంతరాలను తెలిపేందుకు ప్రభుత్వానికి సమయం ఇస్తామని, ఆలోగా పిటిషనర్ల భద్రతనూ తాము కాపాడాలని తెలిపింది. వారు (పిటిషనర్లు) కూడా సమాజంలో అంతర్భాగమని స్పష్టం చేసింది. దీనిపై వచ్చే మంగళవారం కేసు మళ్లీ విచారణ జరగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img