Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జరిమానా చెల్లింపు దానం కాదు

కోర్టు ఆదేశాలు అమలు చేయకుంటే చర్యలు తప్పవు
ఏపీ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : కోర్టు ఆదేశాల అమలులో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో జరిగిన పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై సీరియస్‌ అయింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి జరిమానా ఏమీ దానం కాదని వ్యాఖ్యానించింది. ఆదేశాలు అమలు చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పర్యావరణ ఉల్లంఘనలను ధృవీకరిస్తూ రూ.24 కోట్లు జరిమానా విధించాలని గతంలో నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ప్రాజెక్టు వ్యయం ఆధారంగా గతంలో రూ. 242 కోట్లు ఎన్జీటీి జరిమానా విధించింది. అనంతరం ఎన్జీటి తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దానిపై విచారణ తదుపరి నిపుణుల కమిటీ ధృవీకరించిన జరిమానా రూ.24 కోట్లను చెల్లించాల్సిందేనని 2022 అక్టోబర్‌ 17న ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఇక రూ.242 కోట్లు పెనాల్టీ విధించాలా? లేదా? అన్నదానిపై విచారణ కొనసాగిస్తామని కోర్టు తెలిపింది. జరిమానా చెల్లింపుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పురుషోత్తపట్నం రైతులకు ఆరేళ్లుగా నష్టపరి హారం ఇవ్వడం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జోషీమఠ్‌ తరహాలో పోలవరం దగ్గర కూడా భూమిపైన చీలికలు వచ్చాయని న్యాయవాది గుర్తుచేశారు. తదుపరి విచారణలో అన్ని విషయాలను పరిశీలిస్తామని న్యాయమూ ర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img