Friday, April 26, 2024
Friday, April 26, 2024

జులైలో విశాఖకు…

. పాలనపై మారిన వ్యూహం
. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల గెలుపు బాధ్యత మంత్రులదే
. తేడాలొస్తే కేబినెట్‌ నుంచి తొలగిస్తా
. మంత్రిమండలి సమావేశంలో సీఎం జగన్‌ హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఉగాది పండుగ నాటికి సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలించాలనే యోచనను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి జులైకి మార్చుకు న్నారు. ఈనెల 28వ తేదీన సుప్రీంకోర్టులో అమరావతి రాజధానిపై విచారణ ఉన్నందున ఈ మార్పు చేసినట్లు కనపడుతోంది. ఈ విషయం మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. అలాగే శాసన సభ్యుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, కొన్ని కీలక అంశాలను సీఎం మంత్రులతో ప్రస్తావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని, ఇందుకు మంత్రులదే పూర్తిబాధ్యతని స్పష్టం చేశారు. శాసనసభ్యుల కోటా కింద టీడీపీ నుంచి పంచుమర్తి అనునాధ నామినేషన్‌ దాఖలు చేయడం, మాజీ హోంమంత్రి చినరాజప్ప క్రాస్‌ ఓటింగ్‌ జరగబోతోందని చేసిన వ్యాఖ్యలతో మంత్రు లకు సీఎం జగన్‌ క్లాసు తీసుకున్నారు. అందరి పని తీరును గమనిస్తున్నానని మంత్రులతో అన్నారు. తేడా లొస్తే మంత్రులను మార్చేస్తానని తీవ్ర హెచ్చరిక చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే కర్తవ్యాన్ని మంత్రులకు అప్పగిస్తూ, ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతను అప్పగించారు. ఇచ్చిన బాధ్యతలు సరిగ్గా నిర్వహించకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. మంత్రుల తీరు బాగాలేక పోతే ఇద్దరు, ముగ్గుర్ని పదవుల నుంచి తప్పించడానికి సైతం వెనకాడబోనని సీఎం చెప్పినట్లు సమాచారం. స్వయంగా సీఎం జగనే ఈ వ్యాఖ్యలు చేయడంతో మంత్రుల్లో ఆందోళన మొదలైంది. దీంతో కేబినెట్‌ నుంచి ఎవర్ని తొలగిస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా శాఖాపరంగా, పనితీరు ఆధారంగా మార్పులు, చేర్పులు ఉంటాయని ఇంకొందరు మంత్రు లను జగన్‌ పరోక్షంగా హెచ్చరించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img