Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తుళ్లూరులో ఉద్రిక్తత.. శ్రావణ్ కుమార్ అరెస్టు..

అమరావతిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తుళ్లూరులో 48 గంటల దీక్షకు జడ శ్రావణ్ కుమార్ పిలుపు ఇచ్చారు. అయితే దీక్షకు వచ్చిన శ్రావణ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రావణ్ నివాసం, కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అక్కడకు ఎవరినీ అనుమతించడం లేదు. రోడ్డుపైకి వచ్చినవాళ్లను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. అలాగే జై భీం భారతి పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలను అంబేద్కర్ విగ్రహం వద్ద అరెస్టు చేశారు. కాగా శ్రావణ్ కుమార్ దీక్షకు మద్దతుగా రాజధాని రైతులు వచ్చారు. ఈ రోజు శిబిరం నిర్వహించ వద్దంటూ రైతులకు పోలీసులు ఆదేశించారు. తుళ్లూరు మెయిన్ బజారులో ఎవ్వరూ ఉండొద్దని.. వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో ఊళ్ళో ఎవరూ తిరగొద్దు అంటూ ముందుగా మైఖ్‌లో చెప్పాలని.. అప్పుడు ఎవ్వరూ ఉండరని రైతులు పోలీసులతో ఉన్నారు. రోడ్‌పైన, ఇంటి ముందు కూర్చున్న గ్రామస్తులను లోపలకు వెళ్లిపోవాలని పోలీసులు కోరుతున్నారు. గ్రామస్తులు మాత్రం ససేమిరా అంటున్నారు.పోలీసుల ఆదేశాలపై మహిళా రైతులు మండిపడుతున్నారు. తుళ్లూరులో 144 సెక్షన్ పెడుతున్నారని.. తాము ఏం చేశామని 144 సెక్షన్ పెడుతున్నారని ప్రశ్నించారు. తాము రాజధాని కోసం భూములు ఇచ్చిన పాపానికి.. అమరావతిలో పాకిస్తాన్ బోర్డర్ కంటే అన్యాయంగా ఉందని, రాజధాని ప్రాంతంలో అంతా అరాచకంగా ఉందని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నుంచి రైతులపై పోలీసులు దమనకాండ సాగిస్తున్నారని, ఇక్కడ తమ ప్రైవేట్ స్థలంలో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఖాళీ చేయాలని పోలీసులు చెప్పడం ఏంటని మహిళా రైతులు ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img