దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత టార్గెట్‌గా జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖాస్త్రం సంధించాడు. ఈ లేఖలో కవితపై సుఖేష్ సంచలన ఆరోపణలు చేశాడు. కవిత సెల్ కంపెనీల ఖాతాల నుంచి రూ.80 కోట్ల నిధులు మళ్లించినట్లు బాంబు పేల్చాడు. ఈ నిధులను మారిషస్‌కు మళ్లించినట్లు ఆరోపిస్తూ.. దీనికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాడు.దిల్లీి మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు చెందిన గ్రీన్ హస్క్ కంపెనీలకు రూ.80 కోట్లు తరలించినట్లు సుఖేష్ ఆరోపించాడు. కూలాష్ గెహ్లాట్ బంధువుల ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు చెప్పాడు. 25ం25ం30 కోట్లు నగదు బదిలీలు జరిగాయని, నగదు బదిలీలపై కేజ్రీవాల్ చాట్స్ వివరాలను కూడా త్వరలోనే విడుదల చేస్తానని తెలిపాడు. వాస్తవాలను బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారని, తమకు అనుకూలమైన జైలు అధికారులతో వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించాడు. వేధింపులపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నాడు.ఈ సందర్భంగా ఢల్లీి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నిర్మాణంపై సుఖేష్ చంద్రశేఖర్ పలు ఆరోపణలు చేశాడు. కేజ్రీవాల్ ఇంటి ఫర్నిచర్ ఖర్చులను తానే భరించానని, ఫర్నిచర్ బిల్లులు తన దగ్గర ఉన్నాయని.. త్వరలో కేజ్రీవాల్‌కు సంబంధించిన మరో కుంభకోణాన్ని త్వరలో బయటపెడతానని అన్నాడు. కేజ్రీవాల్ ఫేస్‌టైమ్ చాట్‌ల స్క్రీన్‌షాట్‌లను విడుదల చేస్తానని, కేజ్రీవాల్ సూచనలతోనే తాను రూ.80 కోట్లు బదిలీ చేసినట్లు సుఖేష్ చెప్పాడు.నగదును యూఎస్‌బీటీ, క్రిప్టో కరెన్సీకి మార్చడిరదని, కేజ్రీవాల్ సూచనతోనే అబుదాబికి నగదు పంపారని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.