Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి దాదాపు ప్రారంభరోజుల స్థాయికి దిగొస్తోంది. గడిచిన 24 గంటల్లో 1225 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరాయి. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు. మరో 14,307 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,21,129 మంది మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది మృతిచెందగా, 1594 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. కాగా, దేశవ్యాప్తంగా 184.06 కోట్ల టీకాలు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img