Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

దేశంలో కొత్తగా 7,495 కరోనా పాజిటివ్‌ కేసులు..

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్‌ బాధితుల సంఖ్య 236కు చేరిందని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. అలాగే 104 మంది కోలుకున్నారని తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 65 మంది ఒమిక్రాన్‌ బారినపడగా, దిల్లీలో ఆ సంఖ్య 64కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7,495 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడిరచారు. కరోనా నుంచి కోలుకుని 6,960 మంది డిశ్చార్జ్‌ అవగా… 434 మంది మృతి చెందారు. ప్రస్తుతం 78,291 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,42,08,926గా ఉంది. ఇప్పటి వరకు కోవిడ్‌ బారిన పడి 4,78,759 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ఇప్పటి వరకు 139.70 కోట్లకు పైగా కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img