Friday, April 26, 2024
Friday, April 26, 2024

బూస్టర్‌ డోస్‌ ఎప్పుడిస్తారు..? : రాహుల్‌ గాంధీ

న్యూదిల్లీ : కరోనా వైరస్‌ మూడో వేవ్‌ను అడ్డుకోవాలంటే 62 శాతంపైగా ప్రజలకు వాక్సిన్‌ అందాలి. కానీ ఇప్పటి వరకూ కేవలం 42శాతం మందికి మాత్రమే వాక్సిన్‌ అందిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. అతి పెద్ద జనాభాగల దేశమైన ఇండియా ఇప్పటి వరకూ సరైన వాక్సిన్‌ పొందలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఒమిక్రాన్‌ కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో బోస్టర్‌ డోస్‌ ఎప్పుడిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీకాలకు సంబంధించిన గణాంకాలపై మాట్లాడుతూ రోజూ 55.3 మిలియన్‌ డోసుల కొరత ఏర్పడుతోందన్నారు. ‘దేశంలో చాలామందికి టీకా అందలేదు. ప్రభుత్వం ఎప్పుడు బూస్టర్‌ డోస్‌ ఇస్తుంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వాక్సినేషన్‌ రేటు డిసెంబరు 21 నాటికి కేవలం 42 శాతం ఉందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img