Friday, April 26, 2024
Friday, April 26, 2024

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సమాప్తం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసాయి. నవంబర్‌ 29న ప్రారంభమైన సమావేశాలు నిర్ధేశించిన దానికంటే ఒక రోజు ముందే బుధవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అధిక ధరలు, నిరుద్యోగం లఖింపూర్‌ ఖేర్‌ ఘటనపై నిరసనలు పోటెత్తాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు విజయవంతమయ్యాయని కేంద్రం ప్రకటించగా.. విపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. ఉభయసభల్లో ఎలాంటి చర్చ లేకుండానే హడావిడిగా బిల్లులు ఆమోదించారని, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చించాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మీడియాతో మాట్లాడుతూ, నవంబర్‌ 29తో మొదలైన సమావేశాలు ఇవాల్టితో ముగిసాయని చెప్పారు. 24 రోజుల్లో 18 సిట్టింగ్స్‌ జరిగాయన్నారు. లోక్‌సభలో 82 శాతం, రాజ్యసభలో 47 శాతం సభాకార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. రాజ్యసభలో 9, లోక్‌సభలో 11 బిల్లులు ఆమోదం పొందినట్టు తెలిపారు. నవంబర్‌ 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, ధరల పెరుగుదలపై ప్రధానంగా చర్చించాలని సమావేశం నిర్ణయించిందని మంత్రి చెప్పారు. దీనిపై చర్చకు ఆర్థిక మంత్రి సిద్ధంగా ఉన్నప్పటికీ చర్చ చోటుచేసుకోకపోవడం దురదృష్టకరమని చెప్పారు. విపక్షాల వైఖరి కారణంగానే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ అనుకున్న స్థాయిలో ఉత్పాదకత సాధించలేదని మంత్రి ప్రహ్లాద్‌ జోషి తప్పుబట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img