Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో లక్షన్నరకు చేరువైన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.దేశవ్యాప్తంగా రోజువారి కొవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దేశంలో ఏడు నెలల తర్వాత రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,41,986 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 285 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 4,72,169 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 40,895 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,44,12,740 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ మరో మైలురాయికి చేరింది. 150 కోట్ల డోసుల టీకాలందించారు. ఇక ఇవాల్టి నుంచి ప్రికాషనరీ డోసుకు రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభంకానున్నాయి. జనవరి 10నుంచి ప్రికాషనరీ డోస్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా 60ఏళ్లకు పైబడిన వారికి, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ ప్రికాషనరీ డోసు అందిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img