Friday, April 26, 2024
Friday, April 26, 2024

నాడు తీసుకొన్నది.. నేడు తిరిగిచ్చారా…!

టాటాకు 75వ స్వాతంత్య్రదిన కానుకగా ఎయిర్‌ ఇండియా
కారుచౌకగా విక్రయంపై కార్మిక సంఘాల ఐక్యవేదిక విమర్శ

న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశానికి, పౌరులకు, శ్రామికులకు, కర్షకులకు వ్యతిరే కంగా విధానాలను అమలు చేస్తే క్రోనీలకు ఊడిగం చేస్తోందని కార్మిక సంఘాల ఐక్యవేదిక దుయ్యబట్టింది. ఇటువంటి చర్యలను ఐక్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకు భావరూప్యతగల వర్గాలు ఏకం కావాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వ రంగ వైమానిక సంస్థ ఎయిర్‌ ఇండియాను టాటాకు చవకగా విక్రయించడాన్ని తీవ్రంగా ఖండిర చింది. దశాబ్దాలుగా ఈ సంస్థ నిర్మాణంలో వెచ్చించిన ప్రజా సొమ్ము మొత్తం వృథా అయిందని వ్యాఖ్యానించింది. నాడు ఆ సంస్థ నుంచి తీసుకున్నారు కాబట్టి నేడు కానుకగా తిరిగిచ్చేశారంటూ ఎద్దేవా చేసింది. దేశ 75వ స్వాతంత్య్ర కానుకగా ఎయిర్‌ ఇండియాను టాటాకు కేంద్రం బహూకరించిందని కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సమాఖ్యలు, సంఘాల ఐక్యవేదిక వ్యాఖ్యానించింది. 1948లో టాటా దగ్గర నుంచి ఎయిర్‌ ఇండియాను కేంద్రప్రభుత్వం తీసుకుంది. ఆపై 1953లో ఈ సంస్థ జాతీయీకరణ జరిగింది. 75 ఏళ్ల తర్వాత అదే సంస్థను కారుచవగా ఇంకా చెప్పాలంటే ఉచితంగా ఇచ్చే కానుకగా టాటా సంస్థకు కేంద్రప్రభుత్వం అప్పగించింది. సంస్థ నిర్మాణా నికి అయిన ఖర్చు కంటే చాలా తక్కువకే ఎయిర్‌ ఇండియాను విక్రయించింది. దేశ విదేశాల్లో ఎయిర్‌ ఇండియా విమానాలు, ఆస్తుల విస్తరణకు ప్రభుత్వ ఖజానా నుంచి అనేక లక్షల కోట్లను వెచ్చించారు. ఒక్క 2009`10లోనే రూ.1,10,000 కోట్లను ఎయిర్‌ ఇండియాలో కేంద్రం పెట్టిందని, అందులో రూ.58,000 కోట్లను నగదు రూపేణ అందించి.. మిగతాది రుణంగా ఇచ్చిందని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్‌, యూటీయూసీ, స్వతంత్ర వ్యవస్థాగత సమాఖ్యలు, సంఘాల ఐక్యవేదిక సంయుక్త ప్రకటన పేర్కొంది. కేవలం రూ.46,262 కోట్లకు టాటాతో సేల్‌ డీల్‌ను కేంద్రం కుదుర్చుకుందని, ఇందులో రూ.67వేల కోట్ల రుణభారం ఉండగా అప్పుల్లో ఉన్న ఆస్తులను కేవలం రూ.18వేల కోట్లకు టాటాకు అప్పగించనున్నట్లు ఐక్యవేదిక తెలిపింది. దీనిని బట్టి ప్రభుత్వ రంగ ఎయిర్‌ ఇండియాను దాదాపు ఉచితంగానే టాటా అందుకుందని వ్యాఖ్యానించింది. మరో నాలుగు సబ్సిడరీల విక్రయానికీ కేంద్రం సిద్ధమైందని ఐక్యవేదిక పేర్కొంది. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్‌ ఇండియాలో విలీనం చేయడాన్ని తీవ్రంగా ఖండిర చింది. నష్టల నివారణ, ఎయిర్‌లైన్స్‌ పునరుద్ధరణ చర్యలంటూ డొల్ల హామీలు ఇచ్చి సంస్థ మరిన్ని నష్టాల్లో కూరుకుపోయి అమ్మకానికి పెట్టే స్థాయికి చేరుకునేలా కేంద్రం చేసిందని విమర్శించింది. తమ క్రోనీలకు లాభాల్లో ఉన్న సంస్థలను అప్పగించే విధానాలపై కేంద్రం మాత్రం మౌనంగా ఉంటోందని.. అవసరం లేనప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌ ఫ్లీట్‌లను కొనుగోలు చేసి ఎయిర్‌ క్యారి యర్‌ను విక్రయించే స్థాయికి చేర్చిందని వ్యాఖ్యానించింది. నిజం మన కళ్ల ముందరే ఉందని, సొంత విమాన సంస్థ లేని ఏకైక దేశంగా భారత్‌ ఉండ బోతోందని ఐక్యవేదిక పేర్కొంది. వర్కర్లకు ఏడాది వరకే రక్షణ ఇవ్వడంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోక తప్పేట్లు లేదని, ఉద్యోగులలో చాలా మంది 4455 ఏళ్ల వారు ఉన్నారని, ఈ వయస్సులో వీరికి వేరే కంపె నీల్లో ఉద్యోగాలు రావడం కష్టసాధ్యమని ఐక్యవేదిక ఆందోళన వ్యక్తంచేసింది. దశాబ్దాలుగా ప్రజాసొమ్ముతో సృష్టించిన ఆస్తులను చవకగా విక్రయిం చేయడమే కాకుండా ప్రజా ప్రయోజనాలకు కేంద్రం గండి కొడుతోందని దుయ్యబట్టింది. గల్ఫ్‌ యుద్ధమప్పుడు దాదాపు లక్ష మంది భారతీయులను 440 విమానాల్లో సురక్షితంగా స్వదేశానికి చేర్చిన ఘనత ఎయిర్‌ ఇండియాకే దక్కిందని పేర్కొంది. అలాగే, కోవిడ్‌ కాలంలో విదేశాల్లో చిక్కుకుపోయిన అనేక మంది భారతీయులను ఇంటికి చేర్చిందని, భూకంపాలు, భారీ వరదలు, మంచు తుపానులు వంటి ప్రకృతి విపత్తులప్పుడు సహాయక చర్యల్లో కీలక పాత్ర వహించిందని ఐక్య వేదిక తెలిపింది. కేంద్రప్రభుత్వ ప్రజా దేశ వ్యతిరేక వినాశకర విధానాలు ఇలాంటి సంస్థలను కార్పొరేట్లకు దారదత్తం చేస్తున్నాయని, దేశ ప్రయోజనాల దృష్ట్యా సామాన్యులు, శ్రామిక పక్షాన తమ ప్రతిఘటనను కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రతరం చేయనున్నట్లు ఐక్యవేదిక వెల్లడిరచింది. తమ పోరులో కలిసిరావాలని పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img