Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నాడు పోషకులం.. నేడు యాచకులం..

బిల్లులు చెల్లించి మా ప్రాణాలు కాపాడండి
ఏపీ కాంట్రాక్టర్ల నిరసన

విశాలాంధ్రవిజయవాడ (గాంధీనగర్‌) : ‘రాష్ట్రంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలిమా ప్రాణాలు కాపాడాలి, నాడు పోషకులంనేడు యాచకులం, ఆస్తులు పోయిఅప్పులు మాత్రమే మిగిలాయి, మా బిల్లులు చెల్లించండి, మా ప్రాణాలు కాపాడండి, మేము అంటూ మిగిలి ఉంటే మీ వెంటే ఉంటాం’ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు అర్థనగ్నంగా ప్లేట్లు పట్టుకుని భిక్షాటన చేస్తూ విజయవాడ ధర్నాచౌక్‌లో శుక్రవారం కదంతొక్కారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పెనుమత్స పెద్దిరాజు, కో`అర్డినేటర్‌ కె.శివకుమార్‌ మాట్లాడుతూ తాము ఒక పని చేస్తే కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం ఇచ్చేది 13 శాతం మాత్రమేనని, తాము ఏ పార్టీకి సంబంధించిన వారము కాదని, రాజకీయాలతో తమకు సంబంధం లేదన్నారు. మూడేళ్ల నుంచి బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయని, సీఎం దయతో స్పందించి బిల్లులను వడ్డీతో సహా చెల్లించాలన్నారు. అలా చేస్తేనే మళ్లీ పనులు చేసి రాష్ట్ర అభివృద్ధికి కారకులవుతామని, యువతకు ఉపాధి చూపిస్తామన్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతామని తెలిపారు. గత ప్రభుత్వంలో బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయనీ, చాలామంది కోర్టుకి వెళ్లమని సలహా ఇచ్చినా, సీఎం జగన్‌పై నమ్మకంతో ఆ పని చేయలేదన్నారు. ప్రస్తుతం 50% బిల్లులు ఇస్తేనే మనుగడ సాగించగలమని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అడిగిన వారికి అడగని వారికి సీఎం అన్ని వరాలు ఇస్తున్నారనీ, తమ మీద కూడా దయ చూపాలని కోరారు. అన్ని విభాగాల్లో అధికారులు నోటీసులు ఇచ్చి పనులు పూర్తిచేయాలని ఒత్తిడి చేస్తున్నారనీ, రుణం ఇచ్చిన బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని, కరోనా కారణంగా వర్కులు చేయలేక, చేసిన పనులకు డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ఒక్క రూపాయి కూడా అప్పు దొరకని విధంగా పరిస్థితులు మారిపోయాయని, కొంతమంది కాంట్రాక్టర్లు ఒత్తిడి భరించలేక చనిపోతున్నారన్నారు. పేమెంట్స్‌ చెల్లించలేని పనులను రద్దు చేసి డిపాజిట్‌లు వెనక్కి ఇవ్వాలన్నారు. నిధులు, నిర్మాణ స్థలం, డ్రాయింగ్‌ అఫ్రూవల్స్‌ లేకుండా టెండర్లు పిలవద్దన్నారు. నవరత్నాలు తరహాలో కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బిల్లులు రాక ఒత్తిడి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, కాంట్రాక్టర్‌ల వేదన వినేందుకు సీఎం జగన్‌ సమయం ఇవ్వాలని ్ల కోరారు. ఈ ధర్నాలో వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంబీఏ సూర్యప్రకాష్‌, సెక్రటరీ శెట్టి విజయ్‌కుమార్‌, మెంబర్‌ ఆర్‌ఎం వెంకట మోహన్‌, కొండా రమేష్‌, రాయన హరినాధ్‌బాబు, విజయవాడ మున్సిపల్‌ కాంట్రాక్టర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, మోటుపల్లి రత్నరావు, ఎన్‌ఆర్‌డీ ప్రసాదరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img