Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నిరీక్షణ ఫలించేనా ?

. విభజన సమస్యలపై 23న మళ్లీ భేటీ
. ఏపీ, తెలంగాణ సీఎస్‌లకు సమాచారం
. భారీ అజెండా సిద్ధం చేసిన కేంద్రం
. ఒక్కరోజు సమీక్షపై అనుమానాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర విభజన జరిగి ఏకంగా ఎనిమిదిన్నర సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా విభజన సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారానికి నోచుకోలేదు. పైగా కేంద్రంలో ఒకే ప్రభుత్వం కొనసాగుతోంది. అవి పరిష్కారం కాని, చేయలేని సమస్యలు కూడా కావు. కేవలం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఆర్థిక భారంతో సంబంధం లేని చిన్నపాటి విభజన సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోవడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు పదేపదే లేఖలు రాసినా, దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్రం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన విభజన సమస్యలతో పాటు మరికొన్ని అంశాలపై సమీక్ష జరపనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి సమాచారం అందింది. దీనిపై రాష్ట్ర ప్రజల్లో మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి. ఈనెల 11వ తేదీన మోదీ రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న తరుణంలో 23న భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని ఆశపడుతున్నారు. విభజన చట్టం ప్రకారం పది సంవత్సరాల కాలంలో విభజన సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సి ఉంది. ఈ గడువు ప్రకారం మరో ఏడాదిన్నర మాత్రమే సమయం మిగిలి ఉంది. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాల పదవీకాలం కూడా మరో ఏడాదిన్నరే మిగిలింది. దీంతో కొన్ని సమస్యలైనా ఈలోపు పరిష్కరించుకోవాలని వైసీపీ ప్రభుత్వం ఆరాటపడుతోంది. గత మూడున్నర సంవత్సరాల కాలంలో విభజన సమస్యల్లో కొత్తగా పరిష్కారం చేశామని చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 23న జరగబోయే సమావేశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశంలో విభజన హామీలతోపాటు వివిధ ఇతర అంశాలకు సంబంధించి రాష్ట్రం చేసిన ప్రతిపాదనలు, కేంద్రం ఇచ్చిన హామీలు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయంతో సాగాల్సిన అంశాలను చేరుస్తూ కేంద్రం భారీ అజెండా సిద్ధం చేసింది. రాష్ట్రం ప్రతిపాదించిన 34 అంశాలను అజెండాలో చేర్చినట్లు తెలిసింది. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియ, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, రెవెన్యూ లోటు, హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆస్తుల విభజన, రక్షణ, విశాఖలో జాతీయ ఫార్మాస్యూటికల్‌-విద్య అధ్యయన సంస్థ ఏర్పాటు, కొత్త రాజధానికి సంబంధించి మౌలిక సౌకర్యాలకు నిధుల సాయం, కృష్ణా బోర్డు పరిధిని నిర్వచించడం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఇతర చర్యలు, ఎర్రచందనం అమ్మకాలకు అనుమతులు, విశాఖలో ఇండియన్‌ విదేశీ వాణిజ్య సంస్థ ఏర్పాటు, నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి బొగ్గు సరఫరా,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img