Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నేటి నుంచి టీచర్ల బదిలీ

మంత్రి బొత్స

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడిరచారు. బదిలీలు పూర్తి అయిన తర్వాతే పదోన్నతుల ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
పదోన్నతులు, బదిలీల గురించి భేటీలో చర్చించినట్లు చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా బదిలీలు చేపట్టనున్నట్లు మంత్రి బొత్స వెల్లడిరచారు. 675 ఎంఈఓ-2 పోస్టులకు సంబంధించి రేపు జీఓ జారీ చేయనున్నట్లు చెప్పారు. 350 మంది గ్రేడ్‌ -2 ప్రధానోపాధ్యాయులు, 9,269 మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తామన్నారు. 1,746 మంది పీజీ ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియను రేపటినుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. కోర్టులకు వెళ్లి ప్రక్రియను అడ్డుకోవద్దని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.
22 నుంచి ఉద్యోగుల బదిలీ
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం ఇస్తూ ఆర్థికశాఖ బుధవారం ఆదేశాలిచ్చింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారికి బదిలీ తప్పనిసరి అని పేర్కొంది. ఏప్రిల్‌ 30 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారికి అభ్యర్థనపై బదిలీకి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో భర్తీ చేశాక ఇతర ప్రాంతాలపై దృష్టి సారిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆదాయాన్ని ఆర్జించే శాఖలుగా ఉన్న వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజు, రవాణా, వ్యవసాయ శాఖలు కూడా నిబంధనలకు అనుగుణంగానే మే 31 లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. పాఠశాల, ఇంటర్‌, ఉన్నతవిద్య శాఖలకు మినహాయింపు ఇచ్చింది. కేసులు, విజిలెన్స్‌ విచారణ ఉన్నవారి వివరాలు చెప్పాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ 1 నుంచి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం వర్తిస్తుందని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img