Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పార్లమెంట్‌లో ఇక ఈ పదాలు వాడకూడదు.. బుక్‌లెట్‌ విడుదల!

చట్ట సభల్లో ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారం వ్యవహరిస్తుంటారు. తమ హోదా, వయసు అన్నీ మరిచి ఒకరినొకరు తిట్టుకుంటారు.ఒక్కోసారి చొక్కాలు పట్టుకొని కొట్టుకునేందుకూ వెనుకాడరు. ఇకపై పార్లమెంట్‌ ఉభయ సభల్లోని సభ్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటున్నారు.ఈ నెల 18వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో లోక్‌ సభ, రాజ్యసభలో ఎంపీలు కొన్ని పదాలను వాడకూడదని లోక్‌ సభ సెక్రటేరియట్‌ ఒక బుక్‌లెట్‌ను విడుదల చేసింది. కొన్ని అభ్యంతరకర పదాలను అందులో పేర్కొంది. వాటిని ఉభయ సభల్లోనూ సభ్యులు వాడకూదని స్పష్టం చేసింది. ఇకపై ‘జుమ్లాజీవి’, ‘కొవిడ్‌ స్పైడర్‌’, ‘స్నూప్‌గేట్‌’, వంటి ఇంగ్లీష్‌ పదాలను పార్లమెంట్‌లో వాడటం నిషిద్ధం. దీంతోపాటుఅవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్‌ వంటి పదాలను అన్‌ పార్టమెంటరీ పదాలుగా గుర్తించింది. వాటిని ఉభయ సభల్లో సభ్యులు వాడటానికి వీలులేదు. వీటితో పాటు చంచా, చంచాగిరి, అసత్య, అహంకార్‌, గూన్స్‌, అప్‌మాన్‌, కాలా బజారీ, దలాల్‌, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్‌, లాలీపాప్‌, విశ్వాస్‌ఘాత్‌, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వంటి హిందీ పదాలు కూడా బుక్‌లెట్‌లో చోటు చేసుకున్నాయి.
వివిధ సందర్భాల్లో దేశంలోని చట్ట సభలు, కామన్వెల్త్‌ దేశాల పార్లమెంట్లలో స్పీకర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన పదాలను బుక్‌ లెట్లో చేర్చారు. అయితే, ఇలాంటి పదాలను వాడిన సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అధికారం లోక్‌ సభ, రాజ్య సభ అధిపతులకే ఉంటుందని లోక్‌ సభ సెక్రటేరియట్‌ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img