Friday, April 26, 2024
Friday, April 26, 2024

పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి పది వేల కోట్లు ఇవ్వండి

. పెరిగిన అంచనా వ్యయాన్ని ఆమోదించండి
. విభజన అంశాల అమలుకు చర్యలు తీసుకోండి
. అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌కు వినతి
. ముగిసిన రెండు రోజుల జగన్‌ దిల్లీ పర్యటన

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి దిల్లీ రెండు రోజల ఆకస్మిక పర్యటన ముగిసింది. బుధవారం అర్ధరాత్రి కేంద్రం హోం మంత్రి అమిత్‌షాతో సుమారు 40 నిమిషాలు భేటీ అయిన సీఎం జగన్‌… గురువారం కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్మలా సీతారామన్‌ను కోరారు. అనంతరం సీఎం దిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్నారు. ఇద్దరు మంత్రుల వద్ద మళ్లీ పాత అంశాలనే ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని జగన్‌ కోరారు. డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2600.74 కోట్లను సత్వరమే తిరిగి చెల్లించాలని, ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ.55,548 కోట్లుగా నిర్థారించిందని, దీనికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. దీంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించి ఇతరత్రా సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు వెంటనే మంజూరు చేయాలని విన్నవించారు. ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా… రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని తగ్గించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లకు కుదించారు. ఇది సరికాదు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, ఈ డబ్బును వెంటనే ఇప్పించాలని అడిగారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండిరగ్‌ కింద పెండిరగ్‌లో ఉన్న 36,625 కోట్ల రూపాయల విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. చివరి అంశంగా…రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీ మరోసారి సీఎం జగన్‌ కేంద్ర మంత్రులకు గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img