Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రభుత్వానికి ఆర్టీసీ ఆదాయం !

బల్క్‌తో భారం…రిటైల్‌గానే డీజిల్‌ కొనుగోలు
త్వరలో 100 ఎలక్ట్రిక్‌ బస్సులు బకారుణ్య నియామకాల భర్తీకి చర్యలు
ఉద్యోగులు సమ్మెకు వెళ్లొద్దు బఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో కొంత ప్రభుత్వానికి బదలాయించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని, ఎంతమేరకు ఇవ్వాలనే దానిపై చర్చించి నిర్ణయిస్తామని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడిరచారు. విజయవాడ బస్‌హౌస్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం అనంతరం మూడు నెలల నుంచి సంస్థ పరిస్థితి మెరుగు పడుతోందన్నారు. సీసీఎస్‌ అప్పు రూ.269 కోట్లు, పీఎఫ్‌లోని అప్పు రూ.640కోట్లు తీర్చేశామని వివరించారు. కరోనా ముందు కార్గో ద్వారా రూ.97.44 కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. గతంలో రోజుకు 18వేల పార్శిళ్లు ఉండగా, ప్రస్తుతం అవి 22వేలకు పెరిగాయ న్నారు. రాష్ట్రంలోని అన్ని చోట్లా రిటైల్‌ పెట్రోలు బంకుల నుంచి డీజిల్‌ కొనుగోలుకు నిర్ణయించి నట్లు పేర్కొన్నారు. నవంబరు నుంచి బల్క్‌ వినియోగదారుల రేట్లు పెరుగుతున్నాయని, రిటైల్‌ కంటే బల్క్‌గా కొనుగోలు చేస్తే, డీజిల్‌ ధర అధికంగా ఉందన్నారు. ఈనెల 1వ తేదీన రిటైల్‌గా డీజిల్‌ ధర రూ.96.02 ఉంటే, బల్క్‌గా రూ.96.24కు పెరిగిందని విశ్లేషించారు. ఈనెల 15 నాటికి రిటైల్‌గా 96.02గా డీజిల్‌ ఉంటే, బల్క్‌ డీజిల్‌ ధర రూ.100.41గా ఉందన్నారు. రిటైల్‌ కంటే రూ.4.39 పైసలు బల్క్‌లో ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ఇంధన తయారీ సంస్థల నుంచి మూడేళ్లకోసారి టెండర్లు వేసి కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నామన్నారు. ఆర్టీసీ ఏడాదికి 30కోట్ల లీటర్ల డీజిల్‌ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి డీజిల్‌ కొత్త రేట్లు అమలులోకి వస్తున్నాయని, బల్క్‌ రేట్లు తగ్గినప్పుడు చమురు ఉత్పత్తి సంస్థల నుంచి తిరిగి కొనుగోలు చేస్తామని చెప్పారు. 2013లోనూ ఇలాంటి సమస్యే ఉత్పన్నమైతే, ఈ తరహా నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. తెలంగాణలోనూ బయట పెట్రోల్‌ బంకుల నుంచి రిటైల్‌గా ఇంధనం కొనుగోలు చేస్తున్నామన్నారు. టీిఎస్‌ఆర్టీసీ, కేరళ, పాండిచ్చేరి ఆర్టీసీలూ సైతం ఇటీవల ఈ తరహా ఆదేశాలు జారీజేశాయని గుర్తుచేశారు. బల్క్‌ ధరలు తగ్గిన తర్వాత ప్రభుత్వ వాహనాలకూ ఆర్టీసీ ద్వారా త్వరలో డీజిల్‌ సరఫరా చేస్తామన్నారు. డీజిల్‌ ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆర్టీసీ టిక్కెట్‌ ధరలు పెంచలేదని స్పష్టంచేశారు. ఏపీలోని రాజోలు, ఏలూరు, ఉరవకొండ, రంగం పేటలో ఆర్టీసీకి రిటైల్‌ పెట్రోలు బంకులున్నాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఎండీ సూచించారు. కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసులోని సమస్యలపై దృష్టి సారించామన్నారు. ప్రభుత్వానికి ఒక్కొక్కటిగా ప్రతిపాదనలు పంపి వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని, ఉద్యోగులు ఆందోళన చెందొద్దని సూచించారు. ఆర్టీసీలో పెండిరగ్‌లో ఉన్న 1500 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎండీ చెప్పారు. 2015`19 వరకు పెండిరగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారని, విలేజ్‌ వార్డు సెక్రటేరియట్‌తోపాటు ఆర్టీసీలోని ఖాళీల్లో వాటి భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం తర్వాత, మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారి పిల్లలకు కారుణ్య నియామకాలు, విలీనానికి ముందు మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారి పిల్లలకు మానిటరీ బెనిఫిట్స్‌ ఇస్తామని చెప్పారు. త్వరలో రాష్ట్రంలోకి 100 ఎలక్ట్రికల్‌ బస్సులు అందుబాటులోకి వస్తా యని వెల్లడిరచారు. మరో 100 డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మారు స్తామని, దీనికి బస్సుకు రూ.60లక్షల చొప్పున ఖర్చవుతుందని ఎండీ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img