Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసన రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ధర్నాలు

25 ప్రధాన డిమాండ్లపై కలెక్టర్లకు వినతిపత్రాలు

అమరావతి : 25 ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో 13జిల్లాల కేంద్రాల్లో మంగళవారం చేపట్టిన ధర్నాలు విజయవంతమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరిని, జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ధర్నాలు నిర్వహించి, అనంతరం ఆయా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేశాయి. పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ను వెంటనే ప్రకటించి అమలు చేయాలని, పెండిరగ్‌లో ఉన్న ఐదు డీఏలకు సంబంధించి పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. సీపీఎస్‌ రద్దు అంశంపై జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న 25 వేల ఉపా ధ్యాయ పోస్టులన్నీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని కోరారు. ఫ్యాప్టో చైర్మన్‌ సిహెచ్‌.జోసఫ్‌ సుధీర్‌బాబు గుంటూరు జిల్లాలో జరిగిన ధర్నాకు నాయక త్వం వహించారు. సెక్రటరీ జనరల్‌ చేబ్రోలు శరత్‌ చంద్ర కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్టణంలో జరిగిన కార్యక్రమానికి నేతృత్వం వహించారు. కోచైర్మన్లు నక్కా వెంకటేశ్వర్లు (చిత్తురుజిల్లా), కె.భాను మూర్తిశ్రీకాకుళం జిల్లా, కె.కులశేఖర్‌రెడ్డినెల్లూరు జిల్లా, వెలమల శ్రీనివాసరావుకృష్ణాజిల్లా మచిలీ పట్టణం, డిప్యూటీ సెక్రటరీ జనరళ్లు ఎన్‌వి రమణయ్యనెల్లూరు జిల్లా, చందోలు వెంకటేశ్వర్లువిశాఖపట్నం జిల్లా, కార్యదర్శి కె.ప్రకాష్‌రావుకర్నూలు జిల్లా, ట్రెజరర్‌ జి.శౌరిరాయులుగుంటూరు జిల్లాలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు పీఎస్‌ఎస్‌ ప్రసాద్‌తూర్పు గోదావరి జిల్లా, రఘురామిరెడ్డి, పి.పాండురంగవరప్రసాదరావుకృష్ణా జిల్లా మచిలీ పట్టణం, జి.హృదయ రాజుఅనంతపురం జిల్లా, జి.నారాయణ రెడ్డికడప జిల్లా, కె.నరహరి పశ్చిమ గోదావరి జిల్లా, పర్రె వెంకటరావుప్రకాశంజిల్లా ధర్నాలకు హాజరయ్యారు. కేజీఎస్‌.గణపతివిజయనగరం జిల్లా, నరోత్తమ రెడ్డి చిత్తురు జిల్లా, 13 జిల్లాల కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వనితులుగా కెఎస్‌.లక్ష్మణరావుకృష్ణా జిల్లాలోని మచిలీపట్టణం, కత్తి నరసింహ రెడ్డిఅనంతపురం జిల్లాలో పాల్గొన్నారు. ఐ.వెంకటేశ్వర రావుతూర్పు గోదావరి జిల్లా, పాకలపాటి రఘువర్మవిజయనగరం జిల్లా, షేక్‌ సాబ్జీ`పశ్చిమ గోదావరి జిల్లా నిరసనలో పాల్గొని ఫ్యాప్టో ఆందోళనకు సంఫీుభావం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img