Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రస్తుతం అక్కడ భారతీయుల భద్రత పైనే దృష్టి పెట్టాం

ఉక్రెయిన్‌ – రష్యా పరిణామాలనునిశితంగా గమనిస్తున్నాం : భారత విదేశాంగశాఖ

ఉక్రెయిన్‌ – రష్యా పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, విషయంలోతటస్థ వైఖరినే అవలంభిస్తున్నట్లు భారత విదేశాంగాశాఖ వెల్లడిరచింది. ఈ సమస్యకు శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కారం లభించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించింది.` ప్రస్తుతం అక్కడ భారతీయుల భద్రత పైనే దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొంది. అక్కడున్న భారతీయుల కోసం 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని తాజా ప్రకటనలో వెల్లడిరచింది. కాగా కీవ్‌ లోని భారత దౌత్యకార్యాలయం కీలక అడ్వయిజరీ విడుదల చేసింది. భారతీయ విద్యార్ధులు ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని , ఇళ్లు , హాస్టళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. రాజధాని కీవ్‌లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, అందుకే పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కూడా సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img