Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బాల్యవివాహాలు

గత ఐదేళ్లలో 50 శాతం పెరుగుదల

కోవిడ్‌ కల్లోలమూ కారణమే..
నేషనల్‌ క్రైం బ్యూరో రిపోర్టులో వెల్లడి

న్యూదిల్లీ : దేశంలో బాల్యవివాహాల సంఖ్య పెరిగిందని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో వెల్లడిరచింది. ఐదేళ్ల కిందటితో పోల్చి చూస్తే 2020లో నమోదైన బాల్యవివాహం కేసులు 50 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా బాల్య వివాహాల నిరోధక చట్టం కింద 2020లో మొత్తం 785 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో అత్యధికంగా 184 కేసులు నమోదైనట్టు పేర్కొంది. ఇక మరో రాష్ట్రం అసోంలో 138 కేసులు నమోదుకాగా పశ్చిమ బెంగాల్‌లో 98, తమిళనాడులో 77, తెలంగాణలో 62 కేసులు నమోదైనట్టు తెలిపింది. ఇదిలా ఉండగా 2019లో దేశ వ్యాప్తంగా 523 కేసులు, 2018లో 501 కేసులు, 2017లో 395, 2016లో 326, 2015లో 293 కేసులు నమోదైనట్టు రికార్డుల్లో పొందుపర్చింది. 18 సంవత్సరాలు నిండని స్త్రీ, 21 ఏళ్లు నిండని వ్యక్తుల వివాహాలను బాల్యవివాహంగా చట్టంలో స్పష్టంగా పేర్కొంటూ.. ఇటువంటి వివాహాలను నిలువరించడానికి ప్రత్యేకంగా బాల్యవివాహాల వ్యతిరేక చట్టాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వెలుగు చూసిన క్రైం బ్యూరో రిపోర్టులపై నిపుణుల్లో భిన్నవాదనలు వినిపించాయి. కొందరు బాల్యవివాహాల కేసులుకు సంబంధించి రిపోర్టింగు పెరగడం కారణంగానే అత్యధికంగా కేసులు వెలుగు చూశాయని తెలిపారు. అయితే ప్రముఖ ఎన్‌జీవో సంజోగ్‌ వ్యవస్థాపక సభ్యుడు రూఫ్‌ సేన్‌ మాట్లాడుతూ…బాల్యవివాహాలు అనేక కారణాల వలన పెరుగుతున్నాయని తెలిపారు. అందులో మానవ అక్రమ రవాణా ప్రధాన కారణంమని పేర్కొన్నారు. రిపోర్టింగు పెరగడం కూడా ఒక కారణమేనని, కౌమారదశలో ఉన్న బాలికలు ప్రేమలో పడటం, పారిపోవడం, సరైన వయసు లేకుండానే వివాహం వంటి ఘటనలు పెరిగాయని తెలిపారు. ఇవే బాల్య వివాహాల సంఖ్య పెరగడానికి పెరగడానికి కారణమని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన కలకత్తా హైకోర్టు న్యాయవాది కౌశిక్‌ గుప్తా మాట్లాడుతూ..బాల్య వివాహాలు పెరుగుతున్నాయని తాను భావించడం లేదని, సాధారణంగానే జరుగుతున్న వివాహాల రిపోర్టింగ్‌లో పెరగడంతోనే కేసుల సంఖ్య పెరిగినట్టు తెలిపారు. ఈ విషయంలో సమాజంలో చైతన్యం వచ్చిందని అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థలు జాగురూకత కారణంగా ఆ వివాహాల రిపోర్టింగు పెరిగినట్టు భావిస్తున్నానని తెలిపారు.
ఇదిలా ఉండగా ది చిల్డ్రన్‌ ప్రోగ్రాం పాలసీ డైరెక్టర్‌ అనిందిత్‌ రాయ్‌ చౌదరి మాట్లాడుతూ..కోవిడ్‌ 19 నేపథ్యం బాల్య వివాహాల పెరుగుదలకు దారితీసిందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలు, పట్టణాల్లోని మురికివాడల్లో పనిచేస్తున్న తమ సిబ్బంది మహమ్మారి సమయంలో బాల్యవివాహాలు బాగా పెరిగాయని తమకు రిపోర్టు చేస్తున్నారని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా ఒక్క బాల్య వివాహాన్ని చూడని గ్రామాల నుంచి అటువంటి కేసులు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, జీవనోపాధిని కోల్పోడం, ఇంటిల్లి పాదికీ ఆహారం దొరకడమే సమస్యగా మారిన కుటుంబాలు తమ ఇళ్లలోని చిన్నారులకు బాల్యవావాహాలు చేస్తున్నారని చెప్పారు. ఒరికి ఆహారం అందించడం కష్టంగా మారడంతో బాల్యవివాహం చేయడం తప్ప మరో మార్గం లేదని వారు భావిస్తున్నారని తెలిపారు. బాల్య వివాహాలు బాలికలకు అత్యంత హానికరమని, శారీరకమానసిక ఆరోగ్యానికి ప్రమాదకరమని గుర్తించేలా చైతన్యం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img