Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భారత్‌లో ఏప్రిల్‌-జూన్‌ మధ్య డెల్టాకు 2.40 లక్షల మంది మృతి

వ్యాక్సినేషన్‌ను సమర్థంగా చేపడితేనే..

లేదంటే భవిష్యత్తులోనూ పునరావృతం

హెచ్చరించిన ఐరాస నివేదిక

ఒమిక్రాన్‌ అత్యంత తీవ్రంగా వ్యాపిస్తోందని, ప్రపంచవ్యాప్త టీకా కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టనంత వరకూ మహమ్మారి సవాళ్లు విసురుతూనే ఉంటుందని ఐరాస తాజా నివేదిక ఒకటి పేర్కొంది. ‘యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ సిట్యుయేషన్‌ అండ్‌ ప్రాస్పెక్టర్‌2022’ గురువారం తాజా నివేదికను విడుదల చేసింది. ప్రమాదరకర డెల్టా వేరియంట్‌ గతేడాది ఏప్రిల్‌`జూన్‌ మధ్య భారత్‌లో 2,40,000 మంది బలిగొంది అని తాజా నివేదిక వెల్లడిరచింది. దక్షిణాసియాలో టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. ఫలితంగా అక్కడ కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని పేర్కొంది. బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌లలో డిసెంబరునాటికి కేవలం 26 శాతం మంది జనాభాకే టీకాను అందించారని ఆ నివేదిక పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img