Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భారత నావికాదళంలోకి ‘ఐఎన్‌ఎస్‌ వేలా’

దేశ నౌవికాదళంలోకి మరో ఆధునిక జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్‌ వేలా’ అందుబాటులోకి వచ్చింది. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరమ్‌సింగ్‌ చేతుల మీదుగా ముంబై తీరంలో గురువారం దీన్ని భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. దీన్ని ముంబయికి చెందిన మజాగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ ఫ్రాన్స్‌కు చెందిన నావల్‌ గ్రూప్‌తో కలిసి నిర్మించింది. భారత్‌కు ఉన్న స్టెల్త్‌ స్కార్పీన్‌ శ్రేణి జలాంతర్గాముల్లో ఇది నాలుగోది. గతంలో తయారు చేసిన కల్వరి, ఖండేరి, కరంజ్‌ జలాంతర్గాములను ఇప్పటికే ప్రారంభించారు.ఐఎన్‌ఎస్‌ అవతార్‌ 1973 ఆగస్టు 31వతేదీన ప్రారంభించిన తర్వాత 37 సంవత్సరాల పాటు దేశానికి గొప్ప సేవలు అందించింది .ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి అత్యంత శక్తివంతమైనది. ఇండియన్‌ నేవీ యొక్క స్టెల్త్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డిస్ట్రాయర్‌ యుద్ధనౌక పలు క్షిపణులు, రాకెట్లతో నిండి ఉంది. ఈ జలాంతర్గామి పోరాట సామర్ధ్యం గణనీయమని నావికాదళ అధికారులు చెప్పారు. మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో దీన్ని రూపొందించామని, ఆత్మనిర్భార్‌ భారత్‌ దిశగా ఇదొక ముందడుగు అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img