Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మళ్లీ వెనకడుగు

జీఓ నం.`2 ఉపసంహరణ
హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:
తొందరపాటు నిర్ణయాలతో తరచూ అభాసుపాలవుతున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా జీవో నెంబర్‌ 2ను ఉపసంహరించుకుంది. సర్పంచ్‌, కార్యదర్శుల అధికారాలను వీఆర్‌ఓలకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవో-2ను సస్పెండ్‌ చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. గతంలో ప్రభుత్వం వేసిన కౌంటర్‌లో కొన్ని లోపాలున్నాయని వాటిని సవరించుకునే లోపే కోర్టుకు వెళ్లారన్న మంత్రి వ్యాఖ్యలపై హైకోర్టు ప్రశ్నించింది. అందుకు భిన్నంగా ప్రభుత్వం వెకేట్‌ చేయాలని కోరడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పిటిషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు న్యాయవాది ప్రకటించారు. తదుపరి విచారణను ఈనెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.
టీటీడీ బోర్డు సభ్యులపై పిల్‌ ఫైల్‌పై ప్రకటన ఇవ్వాలి
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో 18 మంది నేర చరిత్ర ఉన్న వ్యక్తులు సభ్యులుగా ఉండటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసినా ఎవరూ కౌంటర్లు దాఖలు చేయలేదని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 15 మంది నోటీసులు తీసుకోగా, ముగ్గురు సభ్యులు తీసుకోలేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. నోటీసులు తీసుకోని బోర్డు సభ్యులు ఎమ్మెల్యే రాం భూపాల్‌ రెడ్డి, ఎంఎన్‌ శశిధర్‌, అల్లూరి మహేశ్వరిలపై పిల్‌ ఫైల్‌ అయినట్టు పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img