Friday, April 26, 2024
Friday, April 26, 2024

మహిళలపై నేరాలు..మొదటి స్థానంలో దిల్లీ…

దేశంలో మహిళలకు రక్షణ లేని నగరంగా రాజధాని దిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. దేశ రాజధానిలో గత ఏడాది ప్రతిరోజూ ఇద్దరు మైనర్‌ బాలికలు అత్యాచారానికి గురయ్యారని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక తెలిపింది.మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఢల్లీిలో మహిళలకు రక్షణ లేదని ఆ డేటా స్పష్టం చేసింది. 2021లో దిల్లీలో 13,892 మహిళలపై నేరాల కేసులు నమోదయ్యాయని 2020తో పోలిస్తే 40 శాతం కంటే ఎక్కువ పెరిగిందని ఎన్సీఆర్బీ వెల్లడిరచింది.2020తో పోలిస్తే అది 40 శాతం ఎక్కువగా అని తేలింది. 2020లో దిల్లీలో కేవలం 9782 క్రైమ్‌ కేసులు మాత్రమే నమోదు అయినట్లు డేటా పేర్కొన్నది. దేశంలోని 19 మెట్రో నగరాలతో పోలిస్తే దిల్లీలో నమోదు అయిన కేసుల సంఖ్య 32.20 శాతంగా ఉన్నట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడిరచింది. దిల్లీ తర్వాత స్థానంలో ముంబై నిలిచింది. ఆ నగరంలో 5543 కేసులు నమోదు అవ్వగా, ఆ తర్వాత బెంగుళూరులో 3127 కేసులు రికార్డు అయ్యాయి. ముంబైలో 12.76 శాతం కేసులు రికార్డు అవ్వగా, బెంగుళూరులో ఆ సంఖ్య 7.2 శాతంగా ఉంది. దిల్లీలో మహిళల కిడ్నాప్‌ సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ 3948 కిడ్నాప్‌ కేసులు నమోదు అయినట్లు ఎన్సీఆర్బీ డేటా స్పష్టం చేసింది. భర్త క్రూరత్వం కింద 4674 కేసులు నమోదు అయ్యాయి. ఇక బాలికల అత్యాచార కేసుల సంఖ్య 833గా ఉంది. ఈ డేటా ఆధారంగా గత ఏడాది దిల్లీలో ప్రతి రోజు ఇద్దరు అమ్మాయిలు రేప్‌కు గురైనట్లు అంచనాకు వచ్చారు. 2021లో దేశవ్యాప్తంగా 19 మెట్రో నగరాల్లో 43,414 కేసులు నమోదు అవ్వగా, దాంట్లో కేవలం దిల్లీలోనే 13,982 కేసులు నమోదు అయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img