Friday, April 26, 2024
Friday, April 26, 2024

మహిళలపై పెరిగిన నేరాలు

. ఏడాదిలో 31వేల ఫిర్యాదులు
. 2014 తరువాత ఇదే అత్యధికం
. జాతీయ మహిళా కమిషన్‌ డేటాతో వెల్లడి

న్యూదిల్లీ: మహిళలపై నేరాలకు సంబంధించి 2022లో జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ)కు 31వేల ఫిర్యాదులు అందాయి. 2014 తర్వాత ఇన్ని ఫిర్యాదులు రాలేదు. 2021లో 30,864 ఫిర్యాదులు రాగా 2022లో వాటి సంఖ్య 30,957కు పెరిగింది. వీటిలో మహిళలపై మానసిక వేధింపులుగౌరవప్రద జీవనానికి సంబంధించినవి 9,710 ఫిర్యాదులు ఉన్నాయి. గృహహింసపై 6,970, వరకట్న వేధింపులపై 4,600 ఫిర్యాదులు వచ్చినట్లు ఎన్‌సీడబ్ల్యూ డేటా చెబుతోంది. ఉత్తరప్రదేశ్‌ నుంచి 16,872 అంటే 54.5శాతం ఫిర్యాదులు రాగా దిల్లీలో 3,004 ఫిర్యాదులు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 1,381, బీహార్‌లో 1,368, హరియాణాలో 1,362 చొప్పున ఫిర్యాదులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ నుంచే అత్యధిక ఫిర్యాదులు రాగా అక్కడ మహిళలకు స్వేచ్ఛగౌరవప్రదమైన జీవనం కష్టసాధ్యం. అలాగే గృహహింస ఎక్కువ. కాగా 2014 తర్వాత భారీ సంఖ్యలో ఫిర్యాదులు నమోదు కాలేదు. ఆ సంవత్సరం వచ్చిన మొత్తం 33,906 ఫిర్యాదులలో మహిళలపై లైంగిక దాడులకు సంబంధించి 2,523 వినతులు ఉండగా అత్యాచారం, అత్యాచార యత్నాలపై 1,701, మహిళలపై పోలీసు జులంకు సంబంధించి 1,623, సైబర్‌ నేరాలపై 924 ఫిర్యాదులు ఉన్నట్లు డేటా తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img