Friday, April 26, 2024
Friday, April 26, 2024

మహిళా రైతుల మీదకు దూసుకొచ్చిన ట్రక్కు..

ముగ్గురు మృతి ` టిక్రీ సరిహద్దు వద్ద దుర్ఘటన
కుట్ర కోణంలో విచారణ చేపట్టాలి : రూ.10 లక్షల పరిహారమివ్వాలి
రైతు సంఘాల నేతల డిమాండు

జలంధర్‌ / బహదూర్‌ఘర్‌ :
లఖింపూర్‌ ఖేరి ఘటనను మరువక ముందే మరో ఘోరం జరిగింది. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలోని టిక్రీ సరిహద్దు వద్ద నిరసన తెలుపుతున్న మహిళా రైతులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిరసన శిబిరానికి దగ్గరలో రaజ్జర్‌ రోడ్డు వద్ద గురువారం ఉదయం 6.15 గంటలప్పుడు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో మహిళలు రోడ్డు డివైడర్‌పై కూర్చొని బహదూర్‌ఘర్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు ఆటో కోసం వేచివున్నారు. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించగా, మరొకరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ట్రక్కు డ్రైవరు పరారీలో ఉన్నట్లు బహదూర్‌ఘర్‌ నగర పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వెల్లడిరచారు. మృతులను అమర్‌జిత్‌ కౌర్‌ (58), గుర్‌మెయిల్‌ కౌర్‌ (60), షిండర్‌ కౌర్‌ (61)గా గుర్తించారు. గుర్‌మెయిల్‌ కౌర్‌, హర్జిత్‌ కౌర్‌ను రొహతక్‌లోని పండిట్‌ భగవత్‌ దయాల్‌ శర్మ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (పీజీఐఎంఎస్‌)కు హుటాహుటిన తరలించారని పోలీసులు తెలిపారు. ఈ మహిళలంతా పంజాబ్‌ మాన్సా జిల్లాలోని భికీ బ్లాకు ఖివా దియాలువాలా గ్రామానికి చెందిన వారన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇదొక ప్రమాదమని తెలిసిందని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని రaజ్జర్‌ ఎస్పీ వసీం అక్రమ్‌ వెల్లడిరచారు. ప్రమాదం జరిగినప్పుడు డివైడర్‌పై ఆరుగురు మహిళలు కూర్చొని ఉన్నారన్నారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించారని, మరొకరిని బహదూర్‌ఘర్‌ సివిల్‌ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. ఈ మహిళలంతా తమ ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు అక్కడకు చేరుకున్నారన్నారు. ట్రక్కు డ్రైవరు పారిపోయినప్పటికీ అతనిని గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని అక్రమ్‌ చెప్పారు. రైతు నాయకులతో మాట్లాడతామన్నారు. ఈ ఘటనపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఏక్తా ఉగ్రహారన్‌) నేతలు బసంత్‌ కోఠా గురు, షింగారా సింగ్‌ మాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాగు చట్టాల వ్యతిరేకోద్యమం మరింత తీవ్రతరం అవుతున్న వేళ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని, తమకు తీరని నష్టమని బసంత్‌ అన్నారు. దీని వెనుక కుట్రకోణాన్ని విచారించాలని మాన్‌ డిమాండు చేశారు. 11 నెలల కిందట ఉద్యమం మొదలైనప్పటికీ రైతులపై అనేక విధాలుగా బెదిరింపులు వస్తుండటాన్ని ప్రస్తావించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల నష్టపరిహరం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న డిమాండుతో ప్రకటన వెలువరిస్తామని చెప్పారు. ఈ కేసులో న్యాయం జరగాలంటూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) డిమాండు చేసింది. దిల్లీలో జరిగే నిరసనల్లో వందలాది మంది నిత్యం పాల్గొంటుండటం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img