Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మా వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉన్నాయి.. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం

ఈడీ నోటీసులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. 9న తనను విచారణకు రమ్మన్నారని.. కానీ 11న తాను వస్తానని చెప్పినట్టు వెల్లడిరచారు. ఈడీ విచారణను ఎదుర్కొంటానని.. ఈడీ అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తానని కవిత స్పష్టం చేశారు. భయమెందుకు? నేనేం తప్పు చేయలేదని.. విపక్షాల మాట కూడా వినాలని కవిత వ్యాఖ్యానించారు. తనతోపాటు ఎవర్ని విచారించినా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.‘దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికొచ్చి విచారించాలని చట్టం చెబుతోంది. దర్యాప్తు సంస్థలు మహిళల్ని విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఈడీ ఎందుకింత హడావిడిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎందుకు చేయరు? కావాలంటే నిందితుల్ని ఇంటికి తీసుకొచ్చి విచారించమని కోరా. కానీ ఈడీ మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఈడీ దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తా. తెలంగాణ నేతల్ని వేధించడం కేంద్రానికి అలవాటైపోయింది. నిందితులతో కలిపి ప్రశ్నించాలనుకుంటే.. నన్ను వీడియో కాన్ఫరెన్స్‌లో విచారించండి’ అని కవిత వ్యాఖ్యానించారు.‘27 ఏళ్లుగా మహిళా బిల్లు కోసం చర్చ జరుగుతోంది. రాజ్యసభలో మహిళా బిల్లు తెచ్చిన సోనియాకు సెల్యూట్‌. మహిళా బిల్లు కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉంది. 10న జంతర్‌మంతర్‌ వద్ద మహిళా బిల్లు కోసం ధర్నా చేస్తున్నాం. అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తామని 2014, 2018లో మోదీ మాటిచ్చారు’ అని కవిత వ్యాఖ్యానించారు. అయితే.. జంతర్‌ మంతర్‌ వద్ద కవిత తలపెట్టిన దీక్షకు పోలీసులు షరతులు విధించారు. కవిత మీడియాతో మాట్లాడుతుండగానే.. ఢల్లీి పోలీసులు వచ్చి ఈ విషయాన్ని చెప్పారు. వేరేవారు కూడా అనుమతి కోరారని.. అందుకే సగం స్థలం మాత్రమే వాడుకోవాలని సూచించారు. ముందే అనుమతి తీసుకున్నా.. ఇప్పుడు ఇలా చేయడం ఏంటని కవిత ప్రశ్నించారు. కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో మా పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేయడమే ఆ పార్టీ లక్ష్యం. మా వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉన్నాయి. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం.’ అని కవిత అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img