Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మూడు లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూలు ప్రకటించింది. మూడు పార్లమెంటు, వీటితోపాటు దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడు ఎన్నికల కమిషన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిరచనున్నారు. కరోనా మహమ్మారి సహా పండుగలు, వరదలు, చలి వంటి అన్ని అంశాలనూ ఎన్నికల సంఘం పరిశీలించిందని ప్రకటనలో తెలిపింది. ఈ విషయాల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే దాద్రా నగర్‌ హవేలి, డామన్‌ అండ్‌ డయ్యూ, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు స్పష్టంచేసింది. వీటితోపాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
పార్లమెంటరీ నియోజకవర్గాలు
కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా అండ్‌ నగర్‌ హేవేలి అమండ్‌ డామన్‌ అండ్‌ డయ్యూలోని దాద్రా అండ్‌ నగర్‌ హవేలీలోనూ, మధ్యప్రదేశ్‌లోని 28-ఖాండ్వా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని 2-మండి పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవే…
ఉప ఎన్నికలు జరుగనున్న వివిధ రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ నియోజవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ (124- బద్వేల్‌- ఎస్‌సీ), అసోం (28-గోస్సాయిగావ్‌), అసోం (41-భవానీపూర్‌), అసోం (58-తముల్‌పూర్‌), అసోం (101-మరైనీ), అసోం (107-థోవ్రా), బీహార్‌ (78-కుషేశ్వర్‌ ఆస్తాన్‌-ఎస్‌సీ), బీహార్‌ (164-తారాపూర్‌), హర్యానా (46-ఎల్లెనాబాద్‌), హిమాచల్‌ ప్రదేశ్‌ (08-ఫతేపూర్‌), హిమాచల్‌ ప్రదేస్‌ (50-అర్కీ), హిమాచల్‌ ప్రదేశ్‌ (65-జుబ్బల్‌-కొథాయ్‌), కర్ణాటక (33-సిండ్గి), కర్ణాటక(82-హాంగల్‌), మధ్యప్రదేశ్‌ (45-పృధ్వీపూర్‌), మధ్యప్రదేశ్‌ (62-రాయ్‌గావ్‌-ఎస్‌సీ), మధ్యప్రదేశ్‌ (192-జోబట్‌-ఎస్‌టీ), మహారాష్ట్ర (90-డెగ్లూర్‌-ఎస్‌సీ), మేఘాలయ (13-మవీన్కెనెంగ్‌-ఎస్‌టీ), మేఘాలయ (24-మాఫ్లాంగ్‌-ఎస్‌టీ), మేఘాలయ (47-రాజబల), మిజోరామ్‌(4-తుయిరియల్‌-ఎస్‌టీ), నాగాలాండ్‌ (58-షామ్‌టోర్‌-చెస్సోర్‌-ఎస్‌టీ), రాజస్థఆన్‌ (155-వల్లభ్‌ నగర్‌), రాజస్థాన్‌ (157-ధరియావాడ్‌-ఎస్‌టీ), తెలంగాణ (31-హుజారాబాద్‌), పశ్చిమబెంగాల్‌ (7-దిన్‌హట), పశ్చిమబెంగాల్‌ (86-శాంతిపూర్‌), పశ్చిమబెంగాల్‌ (109-ఖర్దహా), పశ్చిమబెంగాల్‌ (127-గోసబ-ఎస్‌సీ).

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img