Friday, April 26, 2024
Friday, April 26, 2024

మే 10న కర్ణాటక ఎన్నికలు

. ఒకే విడత పోలింగ్‌…
. మే13న ఓట్ల లెక్కింపు
. ఏప్రిల్‌ 13న నోటిఫికేషన్‌ విడుదల
. షెడ్యూల్‌ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
. అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి

న్యూదిల్లీ: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఒకే దశలో మే 10న ఎన్నికలు, మే 13న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వెల్లడిరచింది. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ`కాంగ్రెస్‌ మధ్య కీలక పోరుకు ఇది వేదిక కానుంది. 224 మంది సభ్యులు గల అసెంబ్లీలో బీజేపీ 119 సీట్లు కలిగి ఉండగా, ఆ తర్వాత కాంగ్రెస్‌ 75 సీట్లను, జనతా దళ్‌ (లౌకిక) 28 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉంది. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ఏప్రిల్‌ 13న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, నామినేషన్‌ పత్రాల దాఖలుకు ఏప్రిల్‌ 20 చివరి తేదీ అని తెలిపారు. ఏప్రిల్‌ 21న నామినేషన్‌ పత్రాల పరిశీలన ఉంటుందని, ఏప్రిల్‌ 24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని వెల్లడిరచారు. ఓటర్లు ఎక్కువగా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు సోమవారం లేదా శుక్రవారం కాకుండా బుధవారం ఎన్నికలు నిర్వహించామని కుమార్‌ చెప్పారు. ‘ప్రజలు ఒక రోజు సెలవు తీసుకొని సుదీర్ఘ వారాంతాన్ని గడపవచ్చు. కానీ బుధవారం పోలింగ్‌ నిర్వహించడం ద్వారా ఆ అవకాశం తగ్గింది’ అని ఆయన అన్నారు. ఎక్కువ మంది పాల్గొనేలా, పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లడంలో ఓటర్ల ఉదాసీనతను అరికట్టడానికి ఈసీ చేసిన ప్రయత్నంలో ఈ చర్య భాగమని ఆయన అన్నారు. అధికార బీజేపీ, కాంగ్రెస్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియామావళి బుధవారమే అమలులోకి వచ్చింది. అయితే కోడ్‌ అమలులోకి రాకముందే, సమీక్షా సమావేశాలలో కమిషన్‌ ఆదేశాలపై దర్యాప్తు సంస్థలు కఠినమైన నిఘా ఉంచాయని కుమార్‌ చెప్పారు. ఇప్పటి వరకు రూ.80 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో చేరిక, భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని కోరుతూ, కర్ణాటకలో అర్హులైన ‘ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాల’ 100 శాతం నమోదుకు హామీ ఇస్తున్నట్లు సీఈసీ తెలిపింది. పీవీటీజీల కోసం 40 ‘ఎథ్నిక్‌ పోలింగ్‌ కేంద్రాలు’ ఏర్పాటు చేస్తారు. ఎన్నికల ప్రక్రియలో థర్డ్‌ జెండర్‌ భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
కొంతమంది థర్డ్‌ జెండర్‌గా నమోదు చేసుకోవడానికి ఇష్టపడడం లేదని ఆయన అన్నారు. కానీ వారి సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని వారు కోరుకున్న లింగంలో నమోదు చేయడానికి అదనపు దూరం వెళ్లడానికి ఈసీ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ‘పట్టణ ఉదాసీనత’ గురించి ప్రస్తావిస్తూ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్‌ ఉన్న టాప్‌ 20 నియోజకవర్గాలలో తొమ్మిది పట్టణ ప్రాంతాలేనని చెప్పారు. ఇటీవల 2022లో జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలలో కూడా ఈ ధోరణి కనిపించిందని సీఈసీ పేర్కొంది. పాఠశాలలు, కళాశాలలు, సంస్థలు, ఆర్‌డబ్ల్యూఏలలో ఓటరు అవగాహన ఫోరమ్‌లలో అవగాహన కల్పించేందుకు కేంద్రీకృత జోక్యాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో 58,282 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌కు సగటు ఓటరు 883గా అంచనా వేశారు. 50 శాతం పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్‌ సౌకర్యం ఉంది. మొత్తం 1,320 పోలింగ్‌ కేంద్రాలను మహిళా అధికారులు నిర్వహించనున్నారు. 5.24 కోట్ల మంది ఓటర్లలో 5.60 లక్షల మంది వికలాంగులుగా గుర్తించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
మే 10న నాలుగు అసెంబ్లీ… ఒక లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు మే 10న నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ సీట్లకు, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ ప్రకటించింది. వీటికి కూడా మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడిరచింది. భారత్‌ జోడో యాత్ర పాల్గొన్న సమయంలో ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్‌ ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ చౌదరి (76) మరణించడంతో ఖాళీ అయిన జలంధర్‌ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అలాగే ఈ ఏడాది జనవరిలో పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో ఎమ్మెల్యే నబా కిశోర్‌ దాస్‌ మరణించడం ద్వారా ఖాళీ అయిన ఒడిశాలోని రaార్సుగూడ అసెంబ్లీ సీటుకు కూడా సీఈసీ ఉప ఎన్నికను ప్రకటించింది. సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్లా అజం ఖాన్‌ దోషిగా తేలడంతో అనర్హత వేటు పడిరది. దీంతో ఉత్తర ప్రదేశ్‌లోని సుర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే ఉత్తర ప్రదేశ్‌లోని మరో స్థానమైన ఛన్బేకు కూడా ఉప ఎన్నికను ప్రకటించింది. ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అప్నా దళ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాహుల్‌ ప్రకాశ్‌ కోల్‌ క్యాన్సర్‌తో మరణించారు. యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ (యూడీపీ) కి చెందిన ఒక అభ్యర్థి మరణించిన కారణంగా ఎన్నిక వాయిదా పడిన మేఘాలయకు చెందిన సోహియోంగ్‌ స్థానంలో కూడా ఉప ఎన్నిక జరగనున్నది. సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలను ప్రకటించడానికి తొందరపడాల్సిన అవసరం లేదని, ఎంపీగా అనర్హత వేటు పడిన రాహుల్‌ గాంధీకి ట్రయల్‌ కోర్టు ఒక నెల గడువు ఇచ్చిందని తెలిపారు.వయనాడ్‌ పార్లమెంటరీ నియోజక వర్గంలో ఖాళీగా ఉన్న స్థానానికి ఈ ఏడాది మార్చి 23న నోటిఫై చేశామని, చట్ట ప్రకారం ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉందన్నారు. మిగిలిన పదవీకాలం ఒక సంవత్సరం కంటే తక్కువ ఉంటే, అప్పుడు ఎన్నికలు నిర్వహించకూడదని చట్టం కూడా చెబుతుందని అన్నారు. వయనాడ్‌ విషయంలో మిగిలిన పదవీకాలం ఏడాది కంటే ఎక్కువేనని సీఈసీ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img